Telangana Government: ఇవి కూడా ఫ్రీగా ఇవ్వాలి.. రేవంత్ సర్కార్‎కు సూచనలు..

తెలంగాణలో గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డిశంబర్ 28న దరఖాస్తు ఫాంలను విడుదల చేసింది. అయితే కొత్త రేషన్ కార్డులు, ఇతర అంశాల్లో ప్రజల్లో తీవ్ర గందరగోళం తలెత్తింది. దీనికి తోడు దరఖాస్తు చేసుకునే అప్లికేషన్లు విరివిగా అందుబాటులో లేకపోవడంతో జిరాక్స్ సెంటర్లలో విపరీతమైన ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తులు చేసుకునేందుకు వస్తున్న ప్రజలు మండిపడుతున్నారు.

Telangana Government: ఇవి కూడా ఫ్రీగా ఇవ్వాలి.. రేవంత్ సర్కార్‎కు సూచనలు..
Praja Palana

Updated on: Dec 28, 2023 | 8:42 PM

తెలంగాణలో గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డిశంబర్ 28న దరఖాస్తు ఫాంలను విడుదల చేసింది. అయితే కొత్త రేషన్ కార్డులు, ఇతర అంశాల్లో ప్రజల్లో తీవ్ర గందరగోళం తలెత్తింది. దీనికి తోడు దరఖాస్తు చేసుకునే అప్లికేషన్లు విరివిగా అందుబాటులో లేకపోవడంతో జిరాక్స్ సెంటర్లలో విపరీతమైన ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తులు చేసుకునేందుకు వస్తున్న ప్రజలు మండిపడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ప్రజలకు దరఖాస్తులు అందజేస్తామని ప్రకటించినా ఫారాలు అందలేదని పలువురు వాపోయారు. జిరాక్స్ సెంటర్లలో ఒక కలర్ ట్రూ కాపీ కోసం నేను రూ.80 చెల్లించాల్సి వచ్చిందని అని ఎర్రగడ్డ సుల్తాన్ నగర్‌లోని దరఖాస్తుదారు గౌసియా బీ అన్నారు. సాధారణంగా ఒక కాపీకి రూ.1 వసూలు చేసే జిరాక్స్ కేంద్రాలు.. ఇప్పుడు దరఖాస్తులతో పాటు జతచేయాల్సిన ఆధార్ కార్డులు, ఇతర పత్రాల కోసం ప్రతి కాపీకి రూ.2 వసూలు చేస్తున్నారు. ఫారమ్ నింపడానికి అదనంగా రూ.10 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు ఫారంలను “ఒక వ్యక్తి ఒక్కో కాపీకి రూ.40 చొప్పున విక్రయిస్తుండటం వెలుగులోకి వచ్చింది. మరి కొన్ని చోట్ల ప్రజాపాలన దరఖాస్తు ఫారమ్‎లు రూ. 80 కి అమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి

దీనిపై బీఎస్పీ పార్టీ అధినేత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజా పాలనా కార్యక్రమంలో భాగంగా సాధారణ సర్టిఫికెట్ మండల ఆఫీసులోనే ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. జిరాక్స్ సెంటర్‎కు లబ్ధిదారులు వెళ్లకుండా ప్రతి గ్రామ పంచాయతీలోనే ఉచితంగా దరఖాస్తు ఫామ్స్, ఆప్లికేషన్ ఫారంలు ఇవ్వాలి. సదరం సర్టిఫికెట్‎ లేని లబ్దిదారులకు కూడా మండల కేంద్రంలోనే ఈ దరఖాస్తు ఫారమ్‎లు అందేటట్లు చూడాలని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీయస్పీ కోరుతున్నది. అంటూ ట్వీట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..