
థాయిలాండ్ గ్యాంబ్లింగ్ వ్యవహారంలో కీలక విషయాలన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికీ చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలు థాయిలాండ్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. థాయ్ మహిళలతో కలిసి క్యాసినో నిర్వహించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. సిసికెమెరాల ద్వారా హైదరాబాద్‌కు క్యాసినో లైవ్ ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. థాయిలాండ్ టూర్ కోసం ఒక్కోక్కరి నుంచి లక్ష 20వేల వసూలు చేశారని, కార్డ్ డీలర్లతో సహా క్యాసినో పరికరాలు ఇండియా నుంచే తీసుకొచ్చారని థాయ్‌లాండ్ చోన్‌బురి పోలీస్ వర్గాలు తెలిపాయి.
ఇండియన్ పర్యాటకులు, స్థానిక థాయ్ మహిళలతో కలిసి హోటల్‌లోకి ప్రవేశించి క్యాసినో నిర్వహించినట్లు థాయిలాండ్ పోలీసులు తెలిపారు. కార్డ్ డీలర్లతో సహా క్యాసినో పరికరాలను ఇండియా నుంచే తెచ్చుకున్నట్లు వెల్లడించారు. హోటల్ పై దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా కార్డ్ గేమ్ ఆడుతున్న పర్యాటకులను పట్టుకున్నామని థాయ్ పోలీసులు చెప్పారు. 25 సెట్ల కార్డులు, 1.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నగదు బదిలీ కోసం వినియోగించిన చిప్‌లతో పాటు 92 మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్, మూడు నోట్ బుక్ కంప్యూటర్లు, కార్డ్ డిస్పెన్సర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు థాయిలాండ్ పోలీసులు. జూదం చిప్‌లను కొనుగోలు చేయడానికి ఓపెన్ క్రెడిట్ ఖాతా సృష్టించి..15 కోట్ల మేరకు క్రెడిట్‌లు సృష్టించి జూదం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు థాయిలాండ్ పోలీసులు.
జూదగాళ్లపై నిఘా ఉంచేందుకు క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు ఉపయోగించినట్లు గుర్తించారు. అలాగే హైదరాబాద్ లో ఉండే జూదగాళ్లకు క్యాసినోపై ఇంట్రస్ట్ కలిగించేందుకు సీసీ కెమెరాల ద్వారా క్యాసినో లైవ్ ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. థాయ్ లాండ్ మహిళ సిత్రనన్ కేవ్‌లోర్ సహకారంతో జూదం ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. గ్యాంబ్లింగ్ ఆదేందుకు థాయిలాండ్‌కు వచ్చిన ఒక్కో ఇండియన్ దగ్గర లక్ష 20వేల రూపాయాలు చికోటీ ప్రవీణ్ టీం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 100 మంది ఇండియన్స్‌తో పాటు ఆరుగురు థాయ్ స్థానికులు, నలుగురు మయన్మార్ జాతీయులను కూడా అరెస్ట్ చేసినట్లు థాయిలాండ్ పోలీసులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..