Telangana: గిరి గ్రామంలో భయం భయం.. గ్రామం ఖాళీ చేసి వలస వెళ్లిన గిరిజనులు.. ఎందుకంటే

అదో గిరిజన మారుమూల కు గ్రామం. ఆదివాసుల సంప్రదాయాలు.. కట్టుబాట్లకు నిలయం. ఊరంతా పచ్చదనం.. ఏమైదో ఏమో తెలియదు‌కా‌నీ ఆ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. అంతే ఆ గ్రామంలోని ఆదివాసీల గుండెల్లో గుబులు మొదలైంది.

Telangana: గిరి గ్రామంలో భయం భయం.. గ్రామం ఖాళీ చేసి వలస వెళ్లిన గిరిజనులు.. ఎందుకంటే
Telugu News

Edited By:

Updated on: Apr 23, 2025 | 12:20 PM

అదో గిరిజన మారుమూల కు గ్రామం. ఆదివాసుల సంప్రదాయాలు.. కట్టుబాట్లకు నిలయం. ఊరంతా పచ్చదనం.. ఏమైదో ఏమో తెలియదు‌కా‌నీ ఆ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. అంతే ఆ గ్రామంలోని ఆదివాసీల గుండెల్లో గుబులు మొదలైంది. గ్రామానికి ఏదో తెలియని కీడు‌పట్టుకుందని.. ఇక్కడే ఉంటే తాము‌కూడా చనిపోతామని ఊరుకు ఊరంతా ఆ గిరిజన గూడాన్ని వదిలింది. ఉన్న ఊరు పచ్చని పంట పొలాలను వదిలేసి పక్క‌గ్రామానికి వలస వెళ్లింది. ఈ ఘటన కొమురంభీం జిల్లా తిర్యానీ మండలం సమతుల గుండంలో చోటు చేసుకుంది.

కొమురంభీం జిల్లా తిర్యాని మండలం సమతుల గుండం గ్రామం. ఈ గ్రామంలో 12 కుటుంబాలు జీవిస్తున్నాయి. గ్రామానికి చెందిన ఆత్రం రాజు కుటుంబం నెల రోజుల వ్యవదిలో నే నలుగురు చనిపోయారు. ఆత్రం రాజు, సోను బాయి బార్య భర్తలిద్దరు అనారోగ్యంతో చనిపోయారు. ఆ ఇద్దరు చనిపోయిన వారం వ్యవదిలోనే కుమారులు బీము, మారుతి సైతం అనారోగ్యంతో చనిపోయారు. దీంతో మిగిలిన 11 కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. గ్రామంలో ఏదో కీడు జరగబోతోందని.. ఇక్కడే ఉంటే తమ కుటుంబాలు కూడా గాల్లో కలుస్తున్నాయి.. ఊరు ఊరంతా ఏకమై వలస వెళ్లే నిర్ణయాన్ని తీసుకుంది.

ఆ 11 కుటుంబాల్లో 5 కుటుంబాలు లింగాపూర్ మండలం భీమన్ గొంది గ్రామంలోని ప్రాథమిక పాఠశాల గది లో బిక్కు బిక్కు మంటూ తలదాచుకుంటుండగా.. మరో 5 కుటుంబాలు సమీపంలోని ఖాళీ స్థలం లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఒక కుటుంబం మాత్రం సమతుల గుండం వద్దే ఉండాలని తమ చావైన, బ్రతుకైనా ఇక్కడే అంటూ ధైర్యంతో మళ్లీ వెనక్కి వచ్చేసింది. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమతుల గుండం ఆ గ్రామం అభివృద్ధికి ఇప్పటికీ నోచుకోలేదు. ఈ గ్రామానికి 8 కిలోమీటర్ల మేర రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పాటు మార్గమధ్యంలో వాగు కూడా ఉండటంతో వర్షాకాలం నరకం చూడక తప్పడం లేదు. చుట్టూ అడవులు మధ్యలో ఎంతో అహ్లదా కరమైన ప్రకృతి ఒడిలో ఆ గ్రామం ఉన్నా.. గ్రామ సమీపంలో వర్షాకాలంలో జలజల పారే జలపాతం ఉన్నా.. అభివృద్ది మాత్రం అసలు కనిపించదు. సముతుల గుండం గ్రామం పరిస్థితి తెలుసుకున్న అక్కడి ఏఎస్పీ చిత్తరంజన్.. వెంటనే స్పందించి మీకు నేనున్నాను భయపడొద్దు.. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాదు ఆ గ్రామాన్ని సందర్శించి వారి బాదలు అడిగి తెలుసుకున్నారు.

నేనున్నానని.. మీకేం కాదని..

మూడనమ్మకాలతో గ్రామాన్ని ఖాళీ చేసిన గిరిజన‌గూడాన్ని సందర్శించారు ఏఎస్పీ చిత్తరంజన్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన సముతులగుండం , భీమన్ గొంది గ్రామాలను ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ,ఆసిఫాబాద్ సిఐ రవీందర్ తో కలసి ద్విచక్ర వాహనంపై వెళ్లి గ్రామాన్ని సందర్శించారు. సమతులగుండం గ్రామంలో ఇటీవల ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో మూడు నమ్మకాల భయంతో ఏ గ్రామాన్ని వదిలి లింగపూర్ మండలంలోని భీమన్ గొంది గ్రామానికి వెళ్లి నివసిస్తున్న ఆదివాసి కుటుంబాలను ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ సందర్శించి వివరాలను అడిగితీసుకున్నారు.మూఢనమ్మకాల పై అవగాహన కల్పించారు,అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. భీమన్ గొంది గ్రామం నుండి మళ్లీ సమతుల గుండం గ్రామానికి తిరిగి రావాలని గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు,మూడ నమ్మకాలను వీడాలన్నారు. మీకు అండగా ఆసిఫాబాద్ జిల్లా పోలీసు శాఖా మీకు ఎల్లా వేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పోలీసులు ప్రజా సేవలు చేయడంలో ముందుంటారని ఆదివాసి గిరిజనులకు తెలియజేశారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఒకటే కుటుంబం నివసిస్తుంది వారికి అవసరమైన నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.. గ్రామస్తులు తమకి రేషన్ కార్డు లేదని పింఛన్ రావడం లేదని ఏఎస్పీ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.