TS Congress: రసవత్తరంగా మారిన మిర్యాలగూడ ఎమ్మెల్యే స్థానం.. అవకాశం ఎవరిని వరించేనో

|

Sep 07, 2023 | 6:24 PM

అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం దగ్గరపడుతోంది. దీంతో టికెట్ రేసులో ఉన్న కొందరు లీడర్లలో టెన్షన్ అంతకంతకీ పెరుగుతోంది. కాంగ్రెస్ టికెట్లకోసం నేతలు ఇప్పటికే పోటీలుపడి దరఖాస్తు చేసుకున్నారు. మిర్యాలగూడ టికెట్ కోసం జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పీసీసీ వికలాంగుల సెల్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో పాటు బీఎల్ఆర్‌గా అంతా పిలిచే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి...

TS Congress: రసవత్తరంగా మారిన మిర్యాలగూడ ఎమ్మెల్యే స్థానం.. అవకాశం ఎవరిని వరించేనో
Miryalaguda
Follow us on

రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. అయితే ఇంతకాలం పార్టీలో పనిచేసిన నేతలు పార్టీ టికెట్ రాకపోతే ప్రత్యామ్నాయం వెతుకునే పనులో పడ్డారు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత పార్టీ టికెట్ వస్తుందో రాదోనన్న అనుమానంతో ఉన్నారట. అందుకే ఆయన బీజేపీ వైపు చూస్తున్నారట. ఇంతకీ ఎవరా లీడర్‌? టికెట్‌పై ఆయనకి ఎందుకంత డౌట్‌?

స్క్రీనింగ్ జరుగుతోంది. అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం దగ్గరపడుతోంది. దీంతో టికెట్ రేసులో ఉన్న కొందరు లీడర్లలో టెన్షన్ అంతకంతకీ పెరుగుతోంది. కాంగ్రెస్ టికెట్లకోసం నేతలు ఇప్పటికే పోటీలుపడి దరఖాస్తు చేసుకున్నారు. మిర్యాలగూడ టికెట్ కోసం జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పీసీసీ వికలాంగుల సెల్ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో పాటు బీఎల్ఆర్‌గా అంతా పిలిచే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ సీనియర్ లీడర్ వారసుడు రేసులో ఉండటంతో.. మిగిలినవారిలో గుబులు మొదలైంది. ఒకప్పుడు కాంగ్రెస్పార్టీకి కంచుకోటలాంటి మిర్యాలగూడలో జానారెడ్డికి గట్టి పట్టుంది. అందుకే ఆయన కొడుకుని కాదని టికెట్ తమదాకా వస్తుందా అన్న అనుమానంతో ఉన్నారు మిగిలిన నేతలు.

ఉమ్మడి జిల్లాలోని పార్టీ ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిల మద్దతుతో టికెట్ ఆశిస్తున్నారట బీఎల్‌ఆర్‌. ఆయనొచ్చాకే మిర్యాలగూడలో పార్టీ బలపడిందన్న భావనతో ఉన్న ఎంపీలు.. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కర్‌రావుకి బీఎల్‌ఆరే సరైన ప్రత్యర్థని భావిస్తున్నారట. కానీ నియోజకవర్గంలో బలమైన అనుచరగణం ఉన్న జానారెడ్డి.. బీఎల్ఆర్ ఆశలకు గండికొట్టేలా ఉన్నారు. కొడుకులిద్దరికీ టికెట్ల విషయంలో జానారెడ్డి పట్టుదలతో ఉండటంతో, కాంగ్రెస్ టికెట్ రాకపోతే ప్రత్యామ్నాయం చూసుకునే ఆలోచనలో ఉన్నారట బీఎల్‌ఆర్‌. టికెట్‌ విషయం తేలాక బత్తుల లక్ష్మారెడ్డి బీజేపీ వైపు వెళ్లొచ్చన్న ప్రచారం బలంగా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మిర్యాలగూడ నుంచి పోటీకి పట్టుదలతో ఉన్నారు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో రఘువీర్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ రఘువీర్‌కి టికెట్ ఇవ్వలేకపోతే.. ఆ స్థానాన్ని బీసీలకైనా ఇవ్వాలనే ఆలోచనతో ఉందట కాంగ్రెస్ అధిష్ఠానం. కొడుక్కి కుదరకపోతే రాజకీయ సమీకరణాలతో నల్గొండ పార్లమెంటు పరిధిలో మిర్యాలగూడ టికెట్ బీసీలకు ఇచ్చేలా చూసి.. బీఎల్ఆర్‌కి జానారెడ్డి చెక్ పెట్టే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఎటుచూసినా టికెట్ కష్టమేనన్న అభిప్రాయానికొచ్చిన బీఎల్ఆర్.. ముందుజాగ్రత్తగా బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారట. జానారెడ్డి మాటని కాదని బీఎల్ఆర్‌కి కాంగ్రెస్ టికెట్ దక్కుతుందా.. విషయం తేలాకే ఆయన బీజేపీలో చేరతారా అన్నదే మిర్యాలగూడలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..