Warangal News: పురిటి నొప్పులతో మహిళ అవస్థలు.. అది గమనించిన యువకులు ఏం చేశారంటే..

|

Jul 23, 2021 | 1:33 PM

Warangal News: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భారీ వర్షాల..

Warangal News: పురిటి నొప్పులతో మహిళ అవస్థలు.. అది గమనించిన యువకులు ఏం చేశారంటే..
Warangal News
Follow us on

Warangal News: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. తాజాగా భారీ వరదల కారణంగా ఓ గర్భిణి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని నర్సంపేట నుంచి నెక్కొండ వెళ్లే ప్రధాన రహదారి పాత మగ్ధుంపురం దగ్గరలో ఉన్న లెవల్ బ్రిడ్జి వద్ద వాగు తీవ్ర ఎక్కువైంది. దాంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులు నెక్కొండ మండలం ముదిగొండ నుంచి నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోలో తీసుకెళ్తున్నారు.

సరిగ్గా వాగు దగ్గర ఆటో వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దాంతో ఏం చేయాలో తెలియక వారు చాలా అవస్థలు పడ్డారు. ఇది గమనించిన స్థానిక యువకులు.. స్టేచర్‌ పై మోసుకుని వాగు దాటించారు. అనంతరం అంబులెన్స్‌ను పిలిపించి అందులో ఎక్కించారు. అంబులెన్స్‌లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, యువకులు చేసిన పనిని చూసి అక్కడి ప్రజలు వారిని అభినందించారు. అధికారులు ఇకనైనా స్పందించి.. ప్రజలు ఇబ్బందులు పడకుండా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు స్థానిక ప్రజలు.

Also read:

Breaking: ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం.. సీఎం జగన్ కీలక నిర్ణయం

మహారాష్ట్రలో మహావిళయం.. జలదిగ్భంధంలో ముంబై.. గోవాండిలో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి!

Watching TV: రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం టీవీ చూశారంటే ఆ వ్యాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువ!