ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ ఆత్మహత్య..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఇన్‌స్టా పోస్ట్‌

ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లోని ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత 18 ఏళ్లుగా తెలుగు మీడియాలో పనిచేసిన స్వేచ్ఛ ప్రస్తుతం టీ న్యూస్‌లో యాంకర్‌గా పని చేస్తున్నారు.

ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ ఆత్మహత్య..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఇన్‌స్టా పోస్ట్‌
News Anchor Swetcha

Updated on: Jun 28, 2025 | 6:45 AM

గత 18 ఏళ్లు తెలుగు మీడియాలో న్యూస్‌ యాంకర్‌గా, జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం టీ న్యూస్ ఛానెల్ లో టీవీ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ శుక్రవారం సాయంత్రం తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. జవహర్ నగర్ లోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్వేచ్ఛ తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్‌లో నివాసం ఉంటున్నారు.

స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న స్నేహితులు, సన్నిహితులు ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్వేచ్ఛ గతంలో టీవీ9లో కూడా పనిచేశారు. అయితే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. వాటికి బుద్ధుడి కోట్‌ను యాడ్‌ చేశారు. “మనసు నిశ్శద్ధంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది” అని రాసుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి