
పనిచేయని అధికారులను అనాలా. పనిచేయించని ప్రజా ప్రతినిధులను అనాలా? ఇద్దరినీ అనాలేమో. ఎన్నికలొస్తే తప్ప రోడ్లు గుర్తుకు రావు. ఎందుకంటే, కాంట్రాక్టర్ల వెనకున్న నాయకులకు ఎంతో కొంత మిగలాలిగా. అధికారులు కూడా అంతే. వేలకు వేలు రోడ్ ట్యాక్సులు వసూలు చేస్తారు. ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా టోల్ ఫీజులు లాగేస్తారు. మరి.. వసూళ్లకు తగ్గ రోడ్లు ఏవి? అసలు ప్రభుత్వాలే అలా తయారయ్యాయి. ఘోర ప్రమాదం జరిగిన వెంటనే కమిటీలు వేస్తారు. ఏదో కాలం గడిపేయడానికి. ఆ తరువాత షరా మామూలే. అలాంటప్పుడు ఎవరినని ప్రశ్నించేది? రోడ్డు ప్రమాదం అంటే ఒక వ్యక్తి చనిపోవడం కాదు. కుటుంబం మొత్తం రోడ్డున పడడం. ఇంట్లో సంపాదించే వ్యక్తి ఒక్కరు చనిపోతే చాలు.. ఆ వ్యక్తినే నమ్ముకున్న కుటుంబం మొత్తం వీధిన పడుతుంది. వృద్ధులైన తల్లిదండ్రులు, ఇంటిపట్టునే ఉండే ఇల్లాలు, నాన్నే ఆధారంగా జీవిస్తున్న పిల్లలు. ఇంతమంది జీవితాలను నాశనం చేసేది ఒక్క రోడ్డు ప్రమాదం. చేవెళ్ల రోడ్డు ప్రమాదాన్నే తీసుకుందాం. టిప్పర్ డ్రైవర్ తాగి లేడు. మద్యం మీద అపవాదు వేద్దామంటే. టిప్పర్ కాలం చెల్లింది కాదు. జస్ట్ ఏడాది క్రితం కొన్నదే. లోడ్, స్పీడ్ అనేవి ఎప్పుడూ ఉండేవే. మరి.. తప్పెక్కడ కనిపిస్తోంది. కనిపిస్తున్న ఈ గుంత దగ్గరే. గుంతను తప్పించడానికి చేసిన ప్రయత్నం బస్సులోని 19 మంది ఆయువు తీసింది. అప్పటికీ బస్సును రోడ్డు నుంచి కిందకి దింపాడు కూడా. అయినా ఆ రోడ్డు...