Bird Walk Festival: కవ్వాల్‌లో కనువిందు చేసిన బర్డ్ వాక్ ఫెస్టివల్.. బారులు తీరుతున్న పక్షి ప్రేమికులు..

కవ్వాల్ ఆభరణ్యం పరిధిలో అటవీ శాఖ అధికారులు బర్డ్ ఫెస్టివల్ ను నిర్వహించారు. ములుగు జిల్లా , సిద్దిపేట జిల్లా అటవీ కళాశాలలు పరిశోధన సంస్థ విద్యార్థులు తెల్లవారుజాము నుంచే అటవీ ప్రాంతంలో కలియ తిరిగారు. తెలంగాణ అటవీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సంయుక్తంగా మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఫెస్టివల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Bird Walk Festival: కవ్వాల్‌లో కనువిందు చేసిన బర్డ్ వాక్ ఫెస్టివల్.. బారులు తీరుతున్న పక్షి ప్రేమికులు..
Bird Walk Festival

Edited By:

Updated on: Mar 01, 2025 | 6:19 PM

కవ్వాల్ అభయారణ్యం గాంధారివనంలో పక్షుల కిలకిలరావాలతో కొత్త శోభ సంతరించుకుంది. వలస వస్తున్న పులులే కాదు పక్షులు సైతం కవ్వాల్ టైగర్ జోన్ లోకి ప్రకృతి ప్రేమికులకు స్వాగతం పలుకుతున్నాయి. వందల రకాల పక్షులు విభిన్న రకాల వన్యప్రాణులు, వలస వస్తున్న విదేశీ పక్షులు ప్రకృతి ప్రేమికుల కెమెరాల్లో అందంగా బంది అవుతున్నాయి. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో సాగుతున్న ‘బర్డ్ ఫెస్టివల్‘ అటు విద్యార్థులకు ఇటు పక్షి ప్రేమికులకు నయనానందాన్ని కలిగిస్తున్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్, గోదావరి పరివాహక ప్రాంతంలో పక్షి వైవిద్యం, సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మార్చి 1, 2 తేదీల్లో రెండు రోజుల పాటు బర్డ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది అటవిశాఖ.

మంచిర్యాల జిల్లా అటవీశాఖ నిర్వహిస్తున్న ఈ పక్షుల పండుగకు మంచి స్పందన లభిస్తోంది. మంచిర్యాల జిల్లా కవ్వాల్ ఆభరణ్యం పరిధిలో అటవీ శాఖ అధికారులు బర్డ్ ఫెస్టివల్ ను నిర్వహించారు. ములుగు జిల్లా , సిద్దిపేట జిల్లా అటవీ కళాశాలలు పరిశోధన సంస్థ విద్యార్థులు తెల్లవారుజాము నుంచే అటవీ ప్రాంతంలో కలియ తిరిగారు. తెలంగాణ అటవీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సంయుక్తంగా మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఫెస్టివల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ప్రముఖ పక్షిశాస్త్రవేత్తలు, నిపుణులు ద్వారా విద్యార్థులు, అటవీశాఖ సిబ్బందికి ప్రత్యేకంగా వర్క్ షాపులు నిర్వహించిన అటవిశాఖ.. గాంధరి వనంలోకి విద్యార్థులను పక్షుల సందర్శనకు తీసుకెళ్లారు. లేలేత కిరణాలు పడుతున్న శుభోదయంలో పక్షుల కిలకిల రావాలను తమ కెమెరాల్లో బందించి మురిసిపోయారు పక్షి ప్రేమికులు, విద్యార్థులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us