
Telangana Govt: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో తెలంగాణ మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరట ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కమిషన్‌లో చైర్‌పర్సన్ సహా ఆరుగురు సభ్యులుగా ఉంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన మహిళా కమిషన్‌కు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చైర్‌పర్సన్‌గా నియామకం అయ్యారు. ఇక కమిషన్ సభ్యులుగా షేహీన అఫ్రోజ్, కుమార ఈశ్వరి భాయి, కొమ్ము ఉమా దేవి, గద్దల పద్మ, సూదం లక్ష్మీ, కటారి రేవతి రావు లను ప్రభుత్వం నియమించింది. కాగా, చైర్ పర్సన్ సహా కమిషన్ సభ్యులు 5ఏళ్ల పాటు పదవిలో ఉండనున్నారు.
Also read: