Driverless Metro Train : భారత్‌లో తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు..ఈ నెల 28న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

భారతదేశపు తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ దీనికి పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. జనక్‌పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్ వరకూ 37 కిలోమీటర్ల మేర మాగ్నెటా..

Driverless Metro Train : భారత్‌లో తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు..ఈ నెల 28న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Follow us

|

Updated on: Dec 27, 2020 | 9:02 PM

Driverless Metro Train : భారతదేశపు తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ దీనికి పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. జనక్‌పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్ వరకూ 37 కిలోమీటర్ల మేర మాగ్నెటా లైన్‌లో ఈ రైలు ప్రయాణం సాగుతుంది.

ఈ వినూత్న రైలు సర్వీసు కోసం ఢిల్లీ మెట్రోరైలు విభాగం ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైవర్ లేకుండా రైలు నడిపే సాంకేతిక ప్రక్రియను సంతరించుకోవడం మెట్రో రైలు వ్యవస్థలో కీలక పరిణామం అయింది. రైలు పట్టాలపై లోపాలు, అడ్డంకులు ఉంటే గుర్తించేందుకు అత్యంత శక్తివంతమైన కెమెరాలు ఏర్పాటు చేశారు.

డ్రైవర్ రహిత రైళ్ల నిర్వహణకు సంబంధించి రైల్వే భద్రతా కమిషనర్ (సిఎంఆర్‌ఎస్) పలు నిర్థిష్ట షరతులు విధించింది. వీటన్నింటికి సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థ నుంచి సంతృప్తికరమైన వివరణలు, ప్రాక్టికల్‌గా వీటిని నిరూపించుకున్న తరువాతనే ఈ డ్రైవర్ లెస్ ట్రైన్‌కు అనుమతిని ఇచ్చారు.