కరీంనగర్‌లో మహిళా వ్యాపారి దారుణ హత్య.. భాగస్వామి పరార్‌..!

|

Jul 01, 2023 | 8:09 AM

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న ఓ మహిళా వ్యాపారి కరీంనగర్‌ భగత్‌నగర్‌లోని క్రిస్టల్‌ ప్లాజా అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురైంది. ఆర్థిక లావాదేవీల కారణంగానే మహిళ ప్రాణాలు బలిగొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ ఘటన..

కరీంనగర్‌లో మహిళా వ్యాపారి దారుణ హత్య.. భాగస్వామి పరార్‌..!
Sarita
Follow us on

కరీంనగర్‌: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న ఓ మహిళా వ్యాపారి కరీంనగర్‌ భగత్‌నగర్‌లోని క్రిస్టల్‌ ప్లాజా అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురైంది. ఆర్థిక లావాదేవీల కారణంగానే మహిళ ప్రాణాలు బలిగొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ ఘటన కరీంనగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

అసలేం జరిగిందంటే..

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడెంకు చెందిన గుండా శ్రీపాల్‌రెడ్డితో సరిత (35)కు 2001లో ప్రేమ వివాహం జరిగింది. గోదావరిఖనిలో కాపురుమున్న ఈ దంపతులకు ఆస్మిత్‌రెడ్డి, మణిత్‌రెడ్డి సంతానం. సరిత గోదావరిఖనిలోనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడంతో భర్త శ్రీపాల్‌రెడ్డి అభ్యంతరం తెలిపాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఏడాది నుంచి సరిత భర్తకు దూరంగా ఉంటోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పనిమీద అప్పుడప్పుడూ కరీంనగర్‌కు వెళ్లే సరితకు భగత్‌నగర్‌లోని క్రిస్టల్‌ అపార్ట్‌మెంట్‌ 203 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న వెంకటేశ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సరిత రూ.20 లక్షలకుపైగా నగదు వెంకటేశ్‌కు ఇచ్చింది. సరిత తమ్ముడు ఆకుల సతీశ్‌ కూడా కరీంనగర్‌లోని రాంనగర్‌లో నివాసం ఉంటున్నాడు. సరితత తన పిల్లలను తీసుకుని కొన్ని రోజులుగా తమ్ముడి ఇంట్లోనే ఉంటోంది. జూన్‌ 28న కొడుకులను గోదావరిఖని పంపి, అదేరోజు సాయంత్రం వెంకటేశ్‌తో కలసి వరంగల్‌కు వెళుతున్నట్లు తమ్ముడికి చెప్పింది.

ఈ మర్నాడు సరిత తమ్ముడు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. సరిత ఫోన్‌ నుంచి ఆమె తమ్ముడికి వెంకటేశ్‌ వాట్సాప్‌ కాల్‌ చేసి.. సరిత తన ఫ్లాట్‌లో ఉందని.. ఆమెను తీసుకెళ్లాలని సమాచారం అందిచి..అనంతరం పరారయ్యాడు. సరిత సోదరి స్వాతి, తమ్ముడు సతీశ్‌ హుటాహుటిన అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తాళం పగలగొట్టి చూడగా రక్తపు మడుగులో తలపై తీవ్రగాయాలతో మెడకు చున్నీ బిగించి విగతజీవిగా సరిత పడి ఉంది. సతీశ్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ రవికుమార్ ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబది కింద దాదాపు రూ. 25 లక్షలు వెంకటేశ్‌కు సరిత ఇచ్చిందని, ఆ డబ్బు అడగడంతో ఇంత దారుణానికి ఒడిగట్టాడని సతీష్ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపార్ట్‌మెంట్‌ సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు వెంకటేశ్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.