Rain Alert: ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే 3 రోజులు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ చూశారా..?

సమ్మర్ స్టార్టింగ్‌లొనే భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదారాబాద్‌ వాతావరణ కేంద్ర చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల తేటికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరో రెండ్రోజుల పాటు రెండు, మూడు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని అంచనా వేసింది.

Rain Alert: ఒక్కసారిగా మారిన వాతావరణం.. వచ్చే 3 రోజులు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ చూశారా..?
Telangana Weather Update

Updated on: Mar 17, 2026 | 4:16 PM

తెలంగాణ వాసుకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణా అంతర్గత కర్ణాటక మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులను వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాబోచే 3 రోజుల పాటు మొస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

వాతావరణ శాఖ ప్రకారం.. మంగళవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రానున్న మూడు, నాలుగు రోజులలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి మూడు నుంచి నాలుగు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

ఇక మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు 30 నుండి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us