Telangana: 9 అడుగుల్లోనే బోరు.. కరెంటు లేకున్నా ఉప్పొంగుతోన్న జల సిరి.. 20 ఏళ్లుగా

|

Apr 04, 2024 | 2:41 PM

ఓ గిరిజన రైతు పంట చేనులో బోరు నుంచి జలం ఉబికి వస్తూనే ఉంది. అసలు ఈ బోరుకు కరెంటు కనెక్షనే లేదు. దాదాపు 20 ఏళ్లుగా నేచురల్‌గానే నీళ్లు ఇలా వస్తూనే ఉన్నాయి. వారు పొలంలో వేసిన జొన్న, గోధుమ పంటలకు ఈ బోరు నుంచి వచ్చే నీటినే అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

Telangana: 9 అడుగుల్లోనే బోరు.. కరెంటు లేకున్నా ఉప్పొంగుతోన్న జల సిరి.. 20 ఏళ్లుగా
Borewell Water
Follow us on

ప్రజంట్ ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పలు చోట్ల తాగునీటికి కూడా సమస్యగా ఉంది. చెరువులు, కుంటల్లో చుక్క నీరు కనిపించడం లేదు. పంటలకు నీరు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆదిలాబాద్ జిల్లాలోని.. ఓ రైతు పంట పొలంలోని బోరు నుంచి నీరు ఉబికి వస్తుంది. దాదాపు 20 ఏళ్లుగా ఆ బోరు ఇలానే నీటిని వెదజల్లుతుంది. ఎండాకాలంలోనూ జలధార తగ్గడం లేదు.  ఇంకో విచిత్రం ఏంటంటే.. ఆ బోరుకు కరెంట్ కనెక్షన్ కూడా లేదు. దాదాపు 20 ఏళ్లుగా ఇలా నేచరల్‌గానే బోర్ నుంచి నీరు తన్నుకువస్తున్నాయి.

ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం దుబ్బగూడ (ఎస్‌)కు చెందిన టేకం తుకారాంకు 26 ఎకరాల పొలం ఉంది. తన ముగ్గరు తనయులతో కలిసి ఈ భూమిలో సాగు కొనసాగిస్తున్నారు తుకారాం. పంటను తడిపేందుకు నీటి కోసం 2005లో బోరు వేయించారు. అప్పుడు 9 అడుగులకే గంగమ్మ బయటకు వచ్చింది. కరెంటు కనెక్షన్‌ ‌ కూడా ఇవ్వకుండానే.. ఆ జలధార ఇప్పటికీ ఉప్పొంగుతోంది. ప్రస్తుతం 13 ఎకరాల్లో గోధుమ, జొన్న పంటలు వేశారు. ఆ చేలకు ఈ బోరు నుంచి వచ్చే నీరే అందిస్తున్నారు.

భూగర్భ జలశాస్త్రం ప్రకారం.. ఈ పరిస్థితిని ఆర్టిసియన్‌ బావి అంటారని హైడ్రో జియాలజిస్ట్‌లు చెబుతున్నారు. దుబ్బగూడ (ఎస్‌)కు దగ్గర్లో గుట్ట ఉంది.  వాన పడినప్పుడు ఆ గుట్ట ప్రాంతంలో వాటర్ రీచార్జ్‌ అవుతుంది. గుట్టు నుంచి నిలువుగా ఉన్న పొర దిగువన గుట్ట దిగిన తర్వాత తుకారాం చేనులో గుండా వెళ్తుంది. పైపొర గుట్ట పైభాగం నుంచి మొదలు కాగా… చివరి పొర తుకారాం చేను గుండా సాగుతోంది. దుబ్బగూడలో ఒక లేయర్‌లో భూగర్భ జలాలు పైపొర వరకు విస్తరించి ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎవరైనా బోరు వేసినప్పుడు ఈ పొరను తాకడంతో నీళ్లు దండిగా వస్తున్నాయి. గుట్టకు సమీపంలో ఉండే ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి