Krishna Board: తెలంగాణ వర్సెస్ ఏపీ: ఉద్యోగులు, సిబ్బంది వివరాలను పది రోజుల్లోగా అందించండి.. కృష్ణా బోర్డు సబ్ కమిటీ

ఉద్యోగులు, సిబ్బంది వివరాలను పది రోజుల్లోగా అందించాలని కోరింది కృష్ణా బోర్డు సబ్ కమిటీ. బనక చెర్ల హెడ్ రెగ్యులేటర్‌ బోర్డు పరిధిలోకి

Krishna Board: తెలంగాణ వర్సెస్ ఏపీ: ఉద్యోగులు, సిబ్బంది వివరాలను పది రోజుల్లోగా అందించండి.. కృష్ణా బోర్డు సబ్ కమిటీ
Krishna Water

Updated on: Sep 17, 2021 | 10:14 PM

AP Vs Telangana: ఉద్యోగులు, సిబ్బంది వివరాలను పది రోజుల్లోగా అందించాలని కోరింది కృష్ణా బోర్డు సబ్ కమిటీ. బనక చెర్ల హెడ్ రెగ్యులేటర్‌ బోర్డు పరిధిలోకి వద్దన్న ఏపీ అధికారుల వాదనతో తెలంగాణ అధికారులు విబేధించారు. బోర్డు పరిధిలోనే ఉంచాలని కోరారు. ఈ అంశాన్ని తామే పరిశీలిస్తామన్నారు కన్వీనర్ పిళ్లై. వీటన్నింటిపై వచ్చే వారం మరోసారి బోర్డు సమావేశం కానుంది. ఉద్యోగులు, సిబ్బంది వివరాలను పది రోజుల్లోగా అందించాలని కృష్ణా బోర్డు సబ్ కమిటి కోరింది. ప్రాజెక్ట్‌లకు సిఐఎస్‌ఎఫ్ భద్రత అంశాన్ని ఫైనల్ మీటింగ్‌లో చర్చించాలని నిర్ణయించారు.

మరో వైపు దరాబాద్‌లోని జలసౌధలో బీపీ పాండే నేతృత్వంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసఘం సమావేశమైంది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్యులు, తెలంగాణ, ఏపీ అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు, రెండు రాష్ట్రాల జెన్‌కో అధికారులు మీటింగ్‌కు హాజరయ్యారు.

గెజిట్ అమలుకు సంబంధించి వ్యవస్థాగత నిర్మాణం, ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ భద్రతా తదితర అంశాలపై చర్చించారు. కాగా, గోదావరిపై అనుమతిలేని అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను నెల రోజుల్లోగా అందజేయాలని ఇరు రాష్ట్రాలకు బోర్డు సూచించింది.

Read also: Yanamala vs Buggana: మాజీ ఆర్థికమంత్రిగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టించడం దుర్మార్గం.. యనమలకు బుగ్గన కౌంటర్