Telangana Assembly: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?

|

Dec 20, 2023 | 5:26 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. శ్వేతపత్రాలపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. సభ సమావేశాలు ప్రారంభం కాగానే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రాన్ని విడుదల చేసి ప్రసంగించారు. 42 పేజీల శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించారు.

Telangana Assembly: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?
Revanth Reddy Bhatti Vikramarka
Follow us on

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. శ్వేతపత్రాలపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. సభ సమావేశాలు ప్రారంభం కాగానే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రాన్ని విడుదల చేసి ప్రసంగించారు. 42 పేజీల శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నాం.. గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదంటూ భట్టి పేర్కొన్నారు. దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలని.. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తాం. సవాళ్లను అధిగమించే దిశలో శ్వేతపత్రం మొదటి అడుగంటూ భట్టి అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లుగా ప్రభుత్వం శ్వేత పత్రంలో వెల్లడించింది. 2014-15లో రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్రాన్ని రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేలా చేశారని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్ని వాస్తవాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే, 2014లో రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉండి, దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిందని తేలినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్రేత పత్రంల లెక్కలు ఇలా..

  • తెలంగాణ మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు
  • 2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లు
  • 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో 24.5 శాతం పెరిగిన అప్పు
  • 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు
  • 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం
  • 2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం
  • బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం
  • 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98 లక్షల కోట్ల వ్యయం
  • రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్రేతపత్రం తప్పుల తడకగా ఉందంటూ బీఆర్ఎస్ పేర్కొంది. పదేళ్లలో తాము సంపాదించిన ప్రగతి ఇదిగో అంటూ బీఆర్‌ఎస్‌ ఏకంగా డాక్యుమెంటరీని రిలీజ్‌ చేసింది. అప్పులంటూ అనవసర రాద్దాంతం చేస్తున్నాంటూ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెచ్చిన అప్పులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై దుష్ప్రచారం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.

BRS లెక్కలు ఇలా..

  • 33జిల్లాలో రూ.1649.62 కోట్లతో జిల్లా కలెక్టరేట్‌ భవనాలు
  • రాష్ట్రంలో 8,578 కిలోమీటర్ల మేర కొత్త రహదారులు
  • 2014కు ముందు 293 గురుకులాలు..ప్రస్తుతం 1022 గురుకులాలు
  • మన ఊరు-మన బడికి మొత్తం ఖర్చు రూ.7,289.54 కోట్లు
  • 22.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
  • రాష్ట్రంలో ఆలయాల అభివృద్దికి రూ.2800 కోట్లు
  • రూ.585 కోట్లతో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌
  • తలసరి విద్యుత్‌ వినియోగంలో 57.82శాతం పెరుగుదల
  • 2014లో విద్యుత్‌ సంస్థల ఆస్తులు రూ.44,431 కోట్లు
  • 2023లో విద్యుత్‌ సంస్థల ఆస్తులు రూ.1,37,571 కోట్లు
  • మొత్తం ఆస్తుల పెరుగుదల రూ.93 వేల కోట్లు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..