Pilot Rohith Reddy: తెలంగాణలో హీటెక్కుతున్న రాజకీయం.. ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్న రోహిత్ రెడ్డి..

|

Dec 19, 2022 | 7:14 AM

కర్ణాటక డ్రగ్స్‌ కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పైలెట్‌ రోహిత్‌రెడ్డి, రఘునందన్‌రావు మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది.

Pilot Rohith Reddy: తెలంగాణలో హీటెక్కుతున్న రాజకీయం.. ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్న రోహిత్ రెడ్డి..
MLA Rohith Reddy
Follow us on

కర్ణాటక డ్రగ్స్‌ కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పైలెట్‌ రోహిత్‌రెడ్డి, రఘునందన్‌రావు మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. కాసేపట్లో లాయర్‌తో కలిసి హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌కు వెళ్లనున్నారు. అయితే, కర్ణాటక డ్రగ్స్‌ కేసులో రోహిత్‌రెడ్డిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ PMLA కింద మణికొండలోని రోహిత్ రెడ్డి నివాసానికి నోటీసులు పంపింది. అయితే ఇక్కడ రోహిత్ రెడ్డి అందుబాటులో లేక పోవడంతో.. ఆయన పీఏకి సమాచారమిచ్చారు. నోటీసుల్లో ఉన్న సమాచారం ప్రకారం.. ఇవాళ ఈడీ ముందుకు హాజరు కానున్నారు తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఈడీ ఇచ్చిన నోటీసులపై ఏం చేయాలనే విషయంపై తన లాయర్ తో డిస్కస్ చేశారు రోహిత్ రెడ్డి. ఈ నోటీసులో ఈడీ అధికారులు ఏం ప్రస్తావించారు, దీనికి ఎలా సమాధానం ఇవ్వాలనే విషయమై తన న్యాయవాదితో చర్చించారు పైలట్ రోహిత్ రెడ్డి.

తన కుటుంబ సభ్యులు, వ్యాపారాలకు సంబంధించిన వివరాలే ఈడీ అధికారులు కోరినట్టుగా చెబుతున్నారు రోహిత్ రెడ్డి. కుటుంబసభ్యుల వివరాలు, ఆస్తుల వివరాలతో హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. ఆధార్‌, పాస్‌పోర్ట్‌, పాన్‌కార్డ్‌, కుటుంబసభ్యుల పేర్లతో ఉన్న సేల్‌ డీడ్‌, ఇన్వాయిస్‌ కాపీలు తేవాలని ఈడీ సూచించింది. ఇంకా, ఆస్తుల కొనుగోలుకు సంబంధించి సోర్స్‌ ఆఫ్‌ ఫండ్‌ వివరాలు కూడా కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈడీ రోహిత్ రెడ్డికి ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందని దానిపై ఉత్కంఠ నెలకొంది. డ్రగ్ కేసుకు సంబంధించిన ప్రశ్నలా? వ్యాపార లావాదేవీలకు సంబంధించిన విచారణా? అనేది సాయంత్రం కల్లా తెలియనుంది.

ఇటీవల కర్ణాటక డ్రగ్స్ కేసు రీ ఓపెనింగ్ విషయమై వాడీ వేడీ చర్చ జరుగుతోంది. బండి సంజయ్ కామెంట్లు చేయడం. దీనిపై బీఆర్ఎస్ లీడర్లు కౌంటర్లు వేయడం.. ఆ వెంటనే ఈడీ నోటీసులు రావడం.. ఆ తర్వాత రోహిత్ భాగ్యలక్ష్మి టెంపుల్ వెళ్లి బండి సంజయ్ కి ప్రమాణాల సవాల్ విసరడం.. దీనికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రియాక్ట్ కావడం.. డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని రోహిత్ ప్రమాణం చేయాలనడం వంటివి జరిగాయి. రోహిత్ కూడా తాను అన్నట్టుగానే రెండో రోజు కూడా భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు. బండి సంజయ్ కి సవాల్ విసరితే.. రఘునందన్ రియాక్టయిన విషయంపైనా హాట్ కామెంట్స్ చేశారు రోహిత్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఈడీ ముందుకు రానున్నారు. అయితే అది ఇవాళా రేపా అన్న క్లారిటీ లేదు. ఎందుకంటే తమకెలాంటి నోటీసులూ అందలేదని అంటోంది రకుల్ కార్యాలయం. దీంతో రకుల్ ఈడీ విచారణ అంశంపై సస్పెన్స్ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..