L Ramana Resign: తెలంగాణలో తెలుగుదేశంపార్టీకి మరో షాక్.. అధ్యక్ష ప‌ద‌వికి ఎల్ ర‌మ‌ణ రాజీనామా..!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద షాక్‌ తగిలింది. ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే సైకిల్‌ దిగేశారు.

L Ramana Resign: తెలంగాణలో తెలుగుదేశంపార్టీకి మరో షాక్.. అధ్యక్ష ప‌ద‌వికి ఎల్ ర‌మ‌ణ రాజీనామా..!
L Ramana

Updated on: Jul 09, 2021 | 12:15 PM

Telangana TDP chief L Ramana resigned: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద షాక్‌ తగిలింది. ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే సైకిల్‌ దిగేశారు. తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పేశారు ఎల్‌.రమణ. నిన్న రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా రాజకీయ అంశాలపై చర్చించారు. ఇవాళ ఉదయం తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు లేఖ పంపారు. త్వరలోనే రమణ కారెక్కబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జగిత్యాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిపొందారు. ప్రస్తుత రాజకీయాల పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు రాజీనామాలో పేర్కొన్నారు. ఇన్నాళ్లు తన రాజకీయ ఎదుగుదలకు తోడ్పడిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు రమణ. ప్రస్తుతం హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో రమణ టీఆర్‌ఎస్‌కి వెళ్లనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also…. UP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్.. రెచ్చిపోయిన ప్రత్యర్థులు.. పోటీ చేస్తున్న మహిళ చీరను లాగి…