మిని నయాగరా జలపాతం జిల్లాలో పోంగిపోర్లుతుంది… అసలు నయగరా ఏంటీ నిజామాబాద్ లో పొంగిపోర్లడం ఏంటీ అనుకుంటున్నారా..? అవును నిజమే నయగరా అందాలు ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఆ జలపాతాన్ని చూస్తే కనిపిస్తున్నాయి.. దట్టమైన అటవీ ప్రాంతంలో చూట్టు కోండల మధ్యలో పకృతిలో పరవశించేలా పారుతుందా ఆ జలపాతం…వాన కాలం వచ్చిందంటే చాలు అక్కడికి పరుగులు పెట్టేలా చేస్తుంది…పర్యటకులతో కిక్కిరిసిపోతుంది.. ఇంతకి నిజామాబాద్ జిల్లాలో ఆ జలపాతం ఎక్కడుంది… ఎలా వెళ్లాలి ..చదివేయండి
నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండలం లో ఉంది ఈ జలపాతం… నిజామాబాద్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్నాపల్లి గ్రామానికి.. మూడు కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవిలో నల్లవెల్లి, సిర్నాపల్లి గ్రామాల్లో ఉంది ఈ అందమైన జలపాతం…. సుమారు 2 వందల సంవత్సరాలకు ముందు రాణి జానకీబాయి తవ్వించిన చెరువు … తన సంస్థానంలో ని ప్రజల తాగు, సాగునీటి అవసరాల కోసం అప్పట్లో ఈ చెరువును నిర్మించారు. ప్రస్తుతం ఆ చెరువు నుండి ప్రవాహించే నీరు ఓ దగ్గర నిర్మించిన డ్యామ్ నుండి కిందకి పడుతూనే ఈ జలపాతం ఏర్పడింది… ఈ క్రమంలో సిర్నాపల్లి సందడి చేస్తుంది..
చుట్టూ దట్టమైన అడవులు…ఎత్తు నుంచి దూకుతున్న జలపరవళ్లు..పక్షుల కిలకిలరావాలు.. పైరగాలులలతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదాన్ని పంచుతోంది. అప్పుడప్పుడు రైలు కూతలు వినిపిస్తుంటాయి. దీంతో పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..