Corona in Telanga Schools: నల్గొండ జిల్లాలో కరోనా కలకలం.. హైస్కూల్ ప్రిన్సిపాల్ మృతి, ముగ్గురు టీచర్లకు పాజిటివ్..

|

Sep 11, 2021 | 4:11 PM

Corona in Telanga Schools: తెలంగాణాలో పలు జిల్లాల్లోని పాఠశాలల్లో కరోనా వైరస్ విజృంభిస్తూ కలవర పెడుతుంది. వివిధ జిల్లాల్లోని స్కూల్స్ లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ..

Corona in Telanga Schools: నల్గొండ జిల్లాలో కరోనా కలకలం.. హైస్కూల్ ప్రిన్సిపాల్ మృతి, ముగ్గురు టీచర్లకు పాజిటివ్..
Ts Corona
Follow us on

Corona in Telanga Schools: తెలంగాణాలో పలు జిల్లాల్లోని పాఠశాలల్లో కరోనా వైరస్ విజృంభిస్తూ కలవర పెడుతుంది. వివిధ జిల్లాల్లోని స్కూల్స్ లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ వైరస్ వ్యాప్తితో ఉపాధ్యాయులు , తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎలాంటి భయమూ వద్దని ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నా కరోనా తన పని తాను చేసుకుని పోతుంది. తాజాగా కరోనా తో స్కూల్ ప్రిన్సిపాల్  మరణించారు. మరో ముగ్గురు టీచర్లకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్న వేళ.. కరోనా వ్యాప్తి తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయులను కోవిడ్ వణికిస్తోంది. సెయింట్ ఆల్ఫోన్సెస్ హైస్కూల్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. హైస్కూల్ లో ప్రిన్సిపాల్ జార్జ్ జోసఫ్ సహా మరో ముగ్గురు ఉపాధ్యాయులకు ,  కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ప్రిన్సిపాల్ జార్జ్ జోసఫ్ మృతి చెందారు.

దీంతో విద్యాశాఖ అధికారులు రంగంలోకి స్కూళ్లను శానిటైజ్ చేయిస్తున్నారు.   జిల్లా అధికారులు విద్యార్థుల పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వైరస్‌ సోకిన వారిని ప్రత్యేకంగా ఉంచి వైద్యం అందిస్తున్నారు. టీచర్స్ కు కరోనా నిర్ధారణ కావడంతో.. సహా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు విద్యార్థుల పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వైరస్‌ సోకిన వారిని ప్రత్యేకంగా ఉంచి వైద్యం అందిస్తున్నారు.

Also Read: Durga Mantras: దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మవారిని ఈ 32 నామాలతో పూజించండి.. అద్భుత ఫలితాలు పొందండి..