Telangana: ఊర్లో అందరి నీటి, ఇంటి పన్నులు కట్టేస్తా.. సర్పంచ్ అభ్యర్థి వినూత్న ఆఫర్.. ఎక్కడంటే?

ఎన్నికలు మొదలయ్యాయంటే చాలూ.. పోటీలో ఉండే అభ్యర్థులు ఓటర్ల వద్దకు క్యూ కడుతారు. వాళ్ల నుంచి ఓట్లు పొందేందుకు ఓటర్లకు రకరకాల హామీలను ఇస్తుంటారు. మరికొందరు ఓటర్లకు స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకొని.. తనను గెలిపిస్తే.. ఈ సమస్యలను పరిష్కరిస్తానని చెబుతుంటారు. తాజాగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.

Telangana: ఊర్లో అందరి నీటి, ఇంటి పన్నులు కట్టేస్తా.. సర్పంచ్ అభ్యర్థి వినూత్న ఆఫర్.. ఎక్కడంటే?
Tg News

Edited By: Anand T

Updated on: Nov 28, 2025 | 6:44 PM

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఇప్పటి నుంచే ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలను రచిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలానే సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడిన ఒక వ్యక్తి ఎన్నికల్లో తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలోని అందరి ఇంటి నీటి పన్నులు తానే చెల్లిస్తానని హమీ ఇచ్చాడు.

వివరాల్లోకి వెళ్తే.. నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందిన రావేళ్ళ కృష్ణారావు ఈ సారి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ మేరకు గ్రామస్తులకు అతను ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తనను సర్పంచ్ గెలిపించాలని అలా చేస్తే గ్రామంలోని అందరి ఇంటి నీటి పన్ను తానే చెల్లిస్తానన్ననాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో మేనిఫెస్టో విడుదల కూడా విడుదల చేశారు. అంతేకాకుండా దేవాలయాల ఉత్సవాలకు నిధులు, ఇంటింటికి ఉచిత మినరల్ వాటర్, పెళ్ళిళ్ళు, జాతరలకు ఉచిత డీజే, మైక్లు అందిస్తానని మేని ఫెస్టోలో పేర్కొన్నాడు.

అయితే కృష్ణారావు విడుదల చేసిన మేనిఫెస్టో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గ్రామంలోని వీరన్న స్వామి ఆలయం కోసం ఒక ఎకరం భూమి విరాళంగా ఇవ్వడంతో పాటు, ఐదు సంవత్సరాలు ఇంటి పన్ను తానే చెల్లిస్తానని కృష్ణారావు చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాటితో పాటు ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు ఉచిత మందులు పంపిణీతో పాటు.. బాగా చదివే విద్యార్థులకు ప్రతి తరగతి నుండి ఇద్దరికి ప్రతి సంవత్సరం 2,000 స్కాలర్‌షిప్ ఇస్తామని మ్యానిఫెస్టో ప్రకటించాడు. ఇప్పుడు ఈ మేనిఫెస్టో జిల్లా లో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.