Independence day 2022: విభిన్న ఆలోచనలు, ఆఫర్లతో ప్రయాణికులను ఆకర్షిస్తోన్న తెలంగాణ ఆర్టీసీ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. ఈరోజు (ఆగస్టు 15)న 75 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఆగస్టు 15న జన్మించిన బాలబాలికలకు 12 ఏళ్ల వవయసు వచ్చే వరకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందిస్తున్నామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సజ్జనార్ మీడియాతో ఈ వివరాలను వెల్లడించారు.
ఇక ఈరోజు ఆర్టీసీ కార్గోలో కిలో బరువు ఉన్న వస్తువులను 75 కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా పంపించనున్నారు. అంతేకాకుండా ఆగస్టు 15 నుంచి 22వ తేదీ వరకు 75 ఏళ్లు దాటిన వృద్ధులకు తార్నాక ఆర్టీసీ హాస్పిటల్‌లో ఉచితంగా మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు, అలాగే 75 శాతం రాయితీతో మందులను పంపిణీ చేయనున్నారు. ఆర్టీసీ ఆఫర్లు ఇంతటితో అయిపోలేవు..
16వ తేదీ నుంచి 21 వరకు తిరులమ శ్రీవారిని దర్శించుకునే వారి కోసం టీటీడీ ప్యాకేజీలపై రూ. 75 డిస్కౌంట్ అందించనున్నారు. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ బస్టాండ్‌లో 32 మంది స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర తెలిపే స్టాళ్లను ఏర్పాటు చేస్తామని సజ్జనార్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..