Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. వారికి బస్సుల్లో ఉచిత ప్రయాణం..!

Telangana RTC: ఉక్రెయిన్‌-రష్యా వార్‌ కొనసాగుతోంది. ఈ ఉద్రిక్తల మధ్య భారత్‌కు చెందిన విద్యార్థులు చిక్కుకుపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వారిని విమానాల ద్వారా..

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. వారికి బస్సుల్లో ఉచిత ప్రయాణం..!

Updated on: Feb 28, 2022 | 1:56 PM

Telangana RTC: ఉక్రెయిన్‌-రష్యా వార్‌ కొనసాగుతోంది. ఈ ఉద్రిక్తల మధ్య భారత్‌కు చెందిన విద్యార్థులు చిక్కుకుపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వారిని విమానాల ద్వారా స్వదేశానికి తీసుకువస్తోంది. ఇక ఉక్రెయిన్‌ (Ukraine)లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు ఒక్కొక్కరుగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇక వారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాష్ట్రంలోని వారి స్వగ్రామానికి వెళ్ళడానికి తెలంగాణ ఆర్టీసీ (RTC) కీలక ప్రకటన చేసింది. విమానాశ్రయం నుంచి నుంచి వారి స్వంత స్థలానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు (RTC Bus)లో ఉచితంగానే ప్రయాణించవచ్చని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (RTC MD Sajjanar) ప్రకటించారు. హైదరాబాద్‌ విమానాశ్రయంకు చేరుకున్న వారు ఎలాంటి టికెట్‌ తీసుకోకుండానే సొంతూరుకు ప్రయాణం చేయవచ్చని తెలిపింది. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ, ముంబై నగరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా వారిని ఉచితంగా తీసుకొచ్చింది.

అక్కడి నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ప్రయాణ ఏర్పాట్లు చేసింది. ఆపదలో ఉండి సురక్షితంగా ఇళ్ళకు చేరుకోవాలనుకునే విద్యార్థులకు బస్సు ఛార్జీ భారంగా మారకుండా ఇలా ఉచిత ప్రయాణ సదుపాయం సౌకర్యం కల్పించింది. ఉక్రెయిన్ నుంచి తెలంగాణ విద్యార్థులంతా క్షేమంగా ఇళ్ళకు చేరుకునేంత వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనునున్నట్లు తెలంగాణ ఆర్టీసీ స్పష్టం చేసింది.

 

ఇవి కూడా చదవండి:

Banking News: ఆ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌ 4 నుంచి కొత్త నిబంధనలు.. అలా చేయకపోతే చెక్కులు చెల్లవు

Post Office: పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలు.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి లాభాలు..!