TSRJC CET: తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ కీలక నిర్ణయం.. టీఎస్ ఆర్‌జేసీ సెట్ ర‌ద్దు

|

Jun 02, 2021 | 2:15 PM

దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలపై కోవిడ్ ప్రభావం పడుతోంది. తాజా గురుకుల ప్రవేశ ప‌రీక్ష వాయిదా ప‌డింది. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ కీలక నిర్ణయం తీసకుంది.

TSRJC CET: తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ కీలక నిర్ణయం.. టీఎస్ ఆర్‌జేసీ సెట్ ర‌ద్దు
Follow us on

Telangana rjccet cancelled: దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలపై కోవిడ్ ప్రభావం పడుతోంది. తాజా గురుకుల ప్రవేశ ప‌రీక్ష వాయిదా ప‌డింది. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ కీలక నిర్ణయం తీసకుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన‌ సాంఘిక సంక్షేమ ఇంట‌ర్ క‌ళాశాల‌ల ప్రవేశ ప‌రీక్ష(టీఎస్ ఆర్‌జేసీ సెట్)ను ర‌ద్దు చేస్తున్నట్లు ఆ శాఖ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. క‌రోనా ప‌రిస్థితులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివ‌రించారు. ఇదే క్రమంలో ప‌దో త‌ర‌గ‌తి గ్రేడ్ల ఆధారంగా ఇంట‌ర్‌లో ప్రవేశాలు ఉంటాయ‌ని స్పష్టం చేశారు. ఆస‌క్తి ఉన్న విద్యార్థులు ఈనెల 7వ తేదీ లోపు మార్కుల‌ను అప్‌లోడ్ చేయాల‌ని సూచించారు. www.tswreis.in వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చన్నారు.

Read Also… Find a Lost Mobile Phone: మీ ఫోన్ పోయిందా? ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా.. ఏదైనా క్షణాల్లో ఇట్టే ట్రాక్ చేసి కనిపెట్టవచ్చు!