Vaccination To Journalists: జర్నలిస్టులకు కరోనా టీకా అందించాలని కేంద్రాన్ని కోరాం…మంత్రి ఈటల రాజేందర్…

| Edited By:

Jan 31, 2021 | 7:53 PM

జర్నలిస్టులకు కరోనా టీకా అందించాలని కేంద్రాన్ని కోరామని, వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని తెలంగాణ వైద్య..

Vaccination To Journalists: జర్నలిస్టులకు కరోనా టీకా అందించాలని కేంద్రాన్ని కోరాం...మంత్రి ఈటల రాజేందర్...
Follow us on

జర్నలిస్టులకు కరోనా టీకా అందించాలని కేంద్రాన్ని కోరామని, వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శామీర్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్‌పోలియో కార్యక్రామన్ని మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో 38,31,907 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామని చెప్పారు. దీనికోసం 23,331 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. మరో 877 మొబైల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఐదేండ్లలోపు చిన్నారుకు పోలియో చుక్కలు వేయించాలని, పల్స్‌ పోలియో ముగిసిన వెంటనే కరోనా వ్యాక్సిన్‌ కూడా వేస్తామని చెప్పారు. శామీర్‌పేట దవాఖానను త్వరలో ట్రామా కేర్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాజీవ్ రహదారి మీద ప్రమాదాలు పెరిగాయని, గాయపడిన వారి ప్రాణాలు కాపడతామన్నారు.