Telangana Corona Updates: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. అయినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న అధికారులు..

|

Jul 15, 2021 | 8:11 PM

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,10,355 సాంపిల్స్ పరీక్షించగా..

Telangana Corona Updates: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. అయినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న అధికారులు..
Corona Deaths
Follow us on

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,10,355 సాంపిల్స్ పరీక్షించగా.. 710 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 6,34,605 మంది కరోనా బారిన పడ్డారు. ఇక ఒక్క రోజులో 808 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారితో కలిపి ఇప్పటి వరకు 6,20,757 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఈ మహమ్మారి కారణంగా ఒక్క రోజులో నలుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కరోనా వైరస్ ప్రభావంతో 3,747 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో రికవరీ రేటు 97.81 శాతం ఉంది. మరణాట రేటు 0.59 శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 10,101 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో నమోదు అయ్యాయి. ఆ తరువాతి స్థానంలో జీహెచ్ఎంసీలో 71 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ – 1, బద్రాద్రి కొత్తగూడెం – 32, జీహెచ్ఎంసీ – 71, జగిత్యాల – 19, జనగామ – 6, జయశంకర్ భూపాలపల్లి – 12, జోగులాంబ గద్వాల – 3, కామారెడ్డి – 3, కరీంనగర్ – 34, ఖమ్మం – 80, కొమరంభీం ఆసిఫాబాద్ – 5, మహబూబ్‌నగర్ – 9, మహబూబాబాద్ – 21, మంచిర్యాల – 47, మెదక్ – 5, మేడ్చల్ మల్కాజిగిరి – 26, ములుగు – 14, నాగర్ కర్నూలు – 7, నల్లగొండ – 52, నారాయణ పేట – 0, నిర్మల్ – 0, నిజామాబాద్ – 7, పెద్దపల్లి – 46, రాజన్న సిరిసిల్ల – 19, రంగారెడ్డి – 29, సంగారెడ్డి – 10, సిద్ధిపేట – 25, సూర్యాపేట – 28, వికారాబాద్ – 4, వనపర్తి – 8, వరంగల్ రూరల్ – 14, వరంగల్ అర్బన్ – 51, యాదాద్రి భువనగిరి – 22 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా, నారాయణపేట, నిర్మల్‌ లలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఈ జిల్లాల అధికారుల పనితీరును ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతానికి కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దని హితవు చెబుతున్నారు. ఒకవేళ బయటకు వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.

Also read:

Viral Photos: బెడ్ కింద పాముల కుప్ప.. తాడు ముక్కలనుకుని కదిలించిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Covid-19 Kit: ఐఐటీ హైదరాబాద్ ప్రోఫెసర్ల అద్భుత ఆవిష్కరణ.. ఇక ఇంట్లోనే కరోనా టెస్ట్‌..

Minister KTR: ఆ రోడ్లను మూసివేయకుండా ఆదేశాలివ్వండి.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కి మంత్రి కేటీఆర్ లేఖ..