Telangana: కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ ప్రభుత్వం..!
Telangana: ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస వేతనాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వారపు సెలవులు లేదా ప్రభుత్వ సెలవు దినాలలో పనిచేసే ఉద్యోగులకు రెట్టింపు వేతనం చెల్లించాలని, రోజుకు ఎనిమిది గంటలకు మించి చేసే..
Telangana: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన కనీస వేతనాలను సవరించింది. ఈ కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి, కేబినెట్ ఉపసంఘం చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త నోటిఫికేషన్ ప్రకారం, కనీస నెలవారీ వేతనాలను కార్మికుల నైపుణ్యం (Skill), వారు పనిచేసే ప్రాంతాల ఆధారంగా మూడు జోన్లుగా విభజించారు.
జోన్-I: మున్సిపల్ కార్పొరేషన్లు
జోన్-II: మున్సిపాలిటీలు
జోన్-III: గ్రామీణ, ఇతర ప్రాంతాలు
సవరించిన కనీస నెలవారీ వేతనాలు
నైపుణ్య వర్గం
జోన్-I
జోన్-II
జోన్-III
నైపుణ్యం లేని
రూ. 16,000
రూ. 15,000
రూ. 14,000
సెమీ-స్కిల్డ్
రూ. 17,000
రూ. 16,000
రూ. 15,000
నైపుణ్యం
రూ. 18,500
రూ. 17,500
రూ. 16,500
అత్యంత నైపుణ్యం
రూ. 20,000
రూ. 19,000
రూ. 18,000
ముఖ్యమైన నిబంధనలు:
సెలవు దినాల్లో పని: వీక్లీ ఆఫ్ లేదా ప్రభుత్వ సెలవు దినాల్లో పనిచేసే ఉద్యోగులకు రెట్టింపు వేతనం (Double wages) చెల్లించాలి.
ఓవర్‌టైమ్: రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే, ఆ అదనపు సమయానికి సాధారణ వేతనం కంటే రెట్టింపు రేటుతో పరిహారం ఇవ్వాలి.
లింగ సమానత్వం: ఒకే రకమైన పని చేసే పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులందరికీ సమాన వేతనాలు అందించాలి.
చెల్లింపు విధానం: యజమానులు వేతనాలను నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాల్లోకి చెక్కులు లేదా ఆన్‌లైన్ విధానాల (NEFT, RTGS, IMPS) ద్వారా మాత్రమే బదిలీ చేయాలి.
కొత్త రంగాలు: ఈ కనీస వేతనాల పరిధిలోకి ఇ-కామర్స్, కొరియర్ సర్వీసులు, మతపరమైన సంస్థలు, అమ్యూజ్‌మెంట్ & వాటర్ పార్కులు, మొబైల్ టవర్ల నిర్వహణ, రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC) యూనిట్లు వంటి పలు కొత్త రంగాలను కూడా చేర్చారు.