Corona Third wave: థర్డ్‌వేవ్ ముప్పుపై సరియైన ఆధారాలు లేవు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదుః తెలంగాణ డీహెచ్

మూడో వేవ్‌ కరోనా ముప్పుపై ఇంకా సరైన ఆధారాలు లేవని తెలంగాణ ప్రజారోగ్య డైరక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Corona Third wave: థర్డ్‌వేవ్ ముప్పుపై సరియైన ఆధారాలు లేవు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదుః తెలంగాణ డీహెచ్
Telangana Public Health Director

Updated on: Jul 08, 2021 | 5:49 PM

Telangana Director of Health Comments on Corona Third Wave: మూడో వేవ్‌ కరోనా ముప్పుపై ఇంకా సరైన ఆధారాలు లేవని తెలంగాణ ప్రజారోగ్య డైరక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోవిడ్‌ తీవ్రత తగ్గినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉందని డీహెచ్‌ శ్రీ‌నివాస‌రావు తెలిపారు.

మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుందని. ఇది నిరంతరాయంగా ఉంటుంతుందని డీహెచ్‌ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1.20కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్‌ పూర్తి అయ్యినట్లు ఆయన చెప్పారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు నెలరోజులపాటు దాదాపు 30లక్షల మందికి పైగా రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకొనే వారు ఉన్నారున్నట్లు డీహెచ్ వెల్లడించారు. హైదరాబాద్‌ మహానగరంలో 100కు పైగా టీకా కేంద్రాలను ఏర్పాటు చేశామన్న ఆయన.. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ అందిస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే, కరోనా మహమ్మారి పూర్తిగా పోలేదని.. మరింత అప్రమత్తంగా ఉంటూ మాస్క్‌లు, సానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని ఆయన సూచించారు.

ఇదిలావుంటే, రాష్ట్రంలో గత రెండేళ్ల నుంచి సీజనల్‌ వ్యాధులు కూడా చాలా వరకు తగ్గాయని డీహెచ్‌ తెలిపారు. నీటి ద్వారా ప్రబలే వ్యాధులు మిషన్‌ భగీరథ నీటి వల్ల తగ్గాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రెండేళ్లు మలేరియా ఫ్రీ రాష్ట్రంగా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీహెచ్‌ వెల్లడించారు.

Read Also… TS Inter: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్స్‌ గడువు పెంచుతూ నిర్ణయం.