IT Raids on Vivek: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ నివాసాల్లో ఐటీ సోదాలు.. మంచిర్యాలలో తీవ్ర ఉద్రిక్తత

|

Nov 21, 2023 | 9:42 AM

IT Raids on Vivek: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇన్‌కమ్ టాక్స్ (ఐటీ) రైడ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా.. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌ వెంకటస్వామికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు మరింత హీట్ పెంచాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌, మంచిర్యాలలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

IT Raids on Vivek: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ నివాసాల్లో ఐటీ సోదాలు.. మంచిర్యాలలో తీవ్ర ఉద్రిక్తత
It Raids On Vivek
Follow us on

IT Raids on Vivek: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇన్‌కమ్ టాక్స్ (ఐటీ) రైడ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా.. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌ వెంకటస్వామికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు మరింత హీట్ పెంచాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌, మంచిర్యాలలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివేక్‌ నివాసాలతోపాటు సోదరుడు వినోద్‌, కుమారుడు, కూతురు, బంధువులు, అనుచరుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం నాలుగు బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే వివేక్‌ కంపెనీలకు చెందిన 8కోట్ల రూపాయలను ఫ్రీజ్‌ చేశారు పోలీసులు. నాలుగు రోజులక్రితం 50లక్షల నగదుతో పట్టుబడ్డారు వివేక్‌ కంపెనీ ఉద్యోగులు. ఇక, ఇప్పుడు ఏకంగా ఐటీ రెయిడ్స్‌ జరగడం కలకలం రేపుతోంది. వివేక్ నివాసాల్లో ఐటీ రెయిడ్స్‌ చేయడంపై ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. మంచిర్యాలలోని వివేక్‌ ఇంటికి పెద్దఎత్తున చేరుకుంటున్నారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. కావాలనే టార్గెట్‌చేసి ఐటీ తనిఖీలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వివేక్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు.

ఇటీవల చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ వివేక్ పై ఎన్నికల సంఘం, ఈడీకి ఫిర్యాదు చేశారు. డబ్బు సంచులతో చెన్నూరుకు వస్తున్నారని.. నేతలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. తనను ఓడించేందుకు డబ్బులను తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాల్క సుమన్ ఫిర్యాదు నేపథ్యంలో విశాఖ ఇండస్ట్రీస్ నుంచి బదిలీ అయున 8 కోట్ల మీద తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇటీవలనే కాంగ్రెస్ లో చేరిక..

అంతకుముందు బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.. నామినేషన్ల పర్వానికి ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కొనసాగిన వివేక్ బాధతో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నేతల చర్చల అనంతరం నవంబర్ 1న రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఆయనతో మాట్లాడిన.. వివేక్ తన కుమారుడు వంశీతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం కాంగ్రెస్ వెంటనే చెన్నూరు నియజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది.

అత్యంత సంపన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా..

కాగా.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న గడ్డం వివేక్‌ వెంకటస్వామి అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. రూ.606 కోట్ల ఆస్తులతో అత్యంత ధనిక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచారు. నామినేషన్ సందర్భంగా ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు, అప్పులను వివరించారు. తనకు దాదాపు రూ.606 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్టు తెలిపారు. చరాస్తులు రూ.380.76 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.225.91 కోట్లు అని చెప్పారు. తనకు, తన భార్యకు రూ.45.44 కోట్ల ఆప్పులు ఉన్నాయని.. విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్‌గా ఆ సంస్థలో రూ.285 కోట్ల విలువచేసే షేర్లు ఉన్నట్లు వెల్లడించారు.

కేసీఆర్ కు అప్పు..

2014లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన వివేక్ చూపించిన ఆస్తులతో పోలిస్తే ఇప్పుడు ఆయన ఆస్తులు 127 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌కు కోటి రూపాయలు అప్పు ఇచ్చినట్లు వివేక్ అఫిడవిట్ లో తెలిపారు. అలాగే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా రూ.1.50కోట్లు అప్పు ఇచ్చినట్లు తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..