Motkupalli: ‘దళిత బంధు అమలు కాకపోతే యాదాద్రిలో ఆత్మహత్య, అతనొక రాజకీయ బ్రోకర్..’ మోత్కుపల్లి కొత్త టర్న్

|

Aug 29, 2021 | 6:26 PM

దళిత బంధు అమలు కాకపోతే యాదాద్రిలో ఆత్మహత్య చేసుకుంటానని సవాల్‌ చేశారు మోత్కుపల్లి నర్సింహులు. ఆ పథకం అమలును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు

Motkupalli: దళిత బంధు అమలు కాకపోతే యాదాద్రిలో ఆత్మహత్య, అతనొక రాజకీయ బ్రోకర్.. మోత్కుపల్లి కొత్త టర్న్
Motkupalli Narasimhulu
Follow us on

Motkupalli – Dalit Bandhu: దళిత బంధు అమలు కాకపోతే యాదాద్రిలో ఆత్మహత్య చేసుకుంటానని సవాల్‌ చేశారు మోత్కుపల్లి నర్సింహులు. ఆ పథకం అమలును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. దళితులకు మంచి జరగకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ నేతల్ని గ్రామాల్లోకి రానివ్వొద్దని పిలుపునిచ్చారు. దళిత బంధుపై ప్రతిపక్షాల తీరుకు నిరసనగా దీక్ష చేశారు మోత్కుపల్లి నర్సింహులు. ఇలాంటి పథకాన్ని ఏ నాయకుడైనా తెచ్చారా అని మోత్కుపల్లి ప్రశ్నించారు. దళితులు ఊళ్లలో ఇంకా చాకిరీ చేయాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్‌ బండ్‌ దగ్గర ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మోత్కుపల్లి.

కాగా, దళిత బంధుపై విపక్షాల కుట్రలకు నిరసనగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం చేపట్టిన ఒక రోజు దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా మోత్కుపల్లి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ బ్రోకర్‌గా అభివర్ణించారు. రేవంత్‌కు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తమకు అడ్డమొస్తే రేవంత్‌ను తొక్కేస్తామని మోత్కుపల్లి వార్నింగ్ ఇచ్చారు.

కుల వివక్షకు గురై దళితులు మానసిక క్షోభకు గురయ్యారని చెప్పిన మోత్కుపల్లి.. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులవి దళితులవని అన్నారు. గ్రామాల్లో తల రుణాలు చేత పట్టుకొని, చెప్పులు చేత పట్టుకొని నడవాల్సిన దుస్థితి పోలేదన్నారు. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేసిందని మెచ్చుకున్నారు మోత్కుపల్లి.

Read also: PV Sindhu: శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారిని దర్శించి.. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న పీవీ సింధు