హైదరాబాద్, ఆగస్టు 20: గిరిజన మహిళను పోలీస్ స్టేషన్‌లో చితకబాదిన ఘటన ఎల్బీనగర్ పోలీసుల మెడకు చుట్టుకుంటుంది. అర్ధరాత్రి ఆటో కోసం వేచి చూస్తున్న మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించి చితక బాదడంతో గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. లక్ష్మీబాయి ఒంటి నిండా గాయాలు ఉండడంతో కర్మన్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటుంది. ఇటు లక్ష్మి భాయ్ కి మద్దతుగా కాంగ్రెస్, బిజెపి గిరిజన సంఘాలు ఆందోళన నిర్వహిస్తుండడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఓ మహిళ కదలికలపై అనుమానాలు వస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనలో ఓ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ పై వేటు వేసిన ఆందోళన విరమించడం లేదు గిరిజన సంఘాలు. కేవలం గిరిజన మహిళ కావడంతోటే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి చిత్రహింసల గురిచేసారన్నారు గిరిజన సంఘాలు.
లక్ష్మీబాయిపై దాడికి పాల్పడ్డ పోలీసులను వెంటనే డిస్మిస్ చేసి.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామంటున్నాయి గిరిజన సంఘాలు. నాలుగు రోజులుగా గిరిజన సంఘాలు ఆందోళన బాట పట్టడంతో హాస్పిటల్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనలు తగ్గుముఖం పట్టకపోవడంతో హై లెవెల్ ఎంక్వయిరీకి ఆదేశించారు రాచకొండ సిపి డి.ఎస్ చౌహన్. ఎల్బీనగర్ డిసిపి సాయి శ్రీ నేతృత్వంలో ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వారం రోజుల నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని గిరిజన సంఘాలకు హామీ ఇచ్చారు పోలీసులు.
అయితే గిరిజన సంఘాలు మాత్రం మహిళపై దాడికి పాల్పడ్డ ముగ్గురు పోలీసులను వెంటనే విధుల్లో నుంచి తొలగించి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే బాధిత మహిళకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసే విషయంలో స్పష్టమైన ప్రకటన వస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్తున్నారు గిరిజన సంఘాలు. ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం సీరియస్‌గా రెస్పాండ్ అయ్యారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి రిపోర్టు ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెకు అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం