తెలంగాణలో రెండు రోజులుగా టెన్త్ పేపర్ లీక్ ఇష్యూ నడుస్తోంది.. ఈ కేసులో బండి సంజయ్ అరెస్టయ్యారు. రిమాండుకూ పంపించారు. అయినా కేసులో ఇంకేదో మిస్సయ్యింది. ఏ ఏదో ఏంటో కాదు.. ఇదే..బండి సంజయ్ ఫోన్.. బండి సంజయ్ ఫోన్ చుట్టూ లీకేజీ దుమారం.. ఫోన్ అడిగితే బండి ఇవ్వడంలేదని సీపీ రంగనాథే చెబుతున్నారు. ఫోన్ ఇస్తే ఏంటి.. బండి సంజయ్ ఫోన్‌లో అసలు కంటే కొసరు మేటరే ఎక్కువుందా.. ఆయన ఫోన్ దొరికితే మొత్తం సినిమా ఐమాక్స్ లో కనిపిస్తుందా..? అసలు బండి సంజయ్ ఫోన్ ఎందుకు దాస్తున్నారు.. నిర్దోషి అయితే ఫోన్ దాయాల్సిన అవసరం ఏంటి?.. ఫోన్ తెస్తే సగం ప్రశ్నలకు సమాధానాలు దొరికేవని వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చెబుతున్నారు.
సంజయ్ ఒక్కసారి ఫోనిస్తే..చాలా విషయాలు వెలుగు చూస్తాయి. ఫోన్‌కు ఎలాంటి సమాచారం వచ్చిందో.. ఎవరెవరికి ఫోన్లు చేశారో..ఎన్నిసార్లు ఫోన్ చేశారో తమకు తెలుసంటున్నారు. అయితే, బండి ఫోన్‌లో వాట్సప్ చాట్, కాల్స్‌ను రికవరీ చేస్తామంటున్నారు పోలీసులు.. పేపర్ లీకేజీ అంతా ఓ గేమ్‌ప్లాన్‌లా భావించి, నడిపిస్తున్నారోనని సీపీ రంగనాథ్ చెప్పారు.
మొత్తానికి మేటర్ అంతా ఫోన్ చుట్టూ తిరుగుతోంది. ఒక్క ఫోన్ వెయ్యి ప్రశ్నలకు సమాధానం అన్నట్లు.. ఇప్పుడు అందరి దృష్టీ ఫోన్‌మీదే పడింది. ఫోన్ దొరుకుతుందా..? దొరికితే.. ఎలాంటి సమాచారం బయటకు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలాఉంటే.. బండి సంజయ్ సహా.. పేపర్ లీక్ కేసు నిందితులను కరీంనగర్ జైలుకు తరలించారు. ఇవాళ బండి సంజయ్ బెయిల్ పై విచారణ జరగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..