సైనిక్ స్కూళ్ల తరహాలో పోలీసు ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూళ్ళు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం ధన్యవాదాలు తెలిపింది. ప్రతి విషయంలో ప్రత్యేక తరహా పాలన చూపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన ఎస్ఐ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఈ ప్రకటన చేశారు. యాభై ఎకరాల స్థలంలో హైదరాబాద్, వరంగల్‌లో అత్యంత ఆధునికంగా స్కూళ్ళను నిర్మిస్తామని ప్రకటించారు. అందులో హోం గార్డునుండి డీజీపీ స్థాయి వరకు తమ పిల్లలను చదివించుకోవచ్చన్నవారు.
పోలీసు ఉద్యోగుల పట్ల తమ ప్రేమను చాటుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు పోలీస్ ఉద్యోగ సంఘాల నేతలు. ఈ సందర్భంగా వరద బాధితులకోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి పోలీసు ఉద్యోగుల ఒకరోజు వేతనం 11,06,83,571 రూపాయలను పోలీసు అధికారుల సంఘం తరఫున, డీజీపీ జితేంద్ర ఆధ్వర్యంలో చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. ధన్యవాదాలు తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన పోలీసులను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ప్రజలు కకావికలం అయ్యారు. వరదల ధాటికి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. సర్వం కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ముందుకు వచ్చారు. వరద బాధితుల కోసం భారీగా విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలోనే వరద బాధితుల కష్టాలను చూసి చలించిపోయిన తెలంగాణ పోలీసులు సైతం అంటూ ముందుకు వచ్చారు. తమ ఒక్క రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..