Viral: పోలీసులను చూడగానే కారులోనే ఫ్యామిలీని వదిలేసి పరారైన వ్యక్తి.. అనుమానంతో ఎంక్వైరీ చేయగా..

| Edited By: Ravi Kiran

Jul 18, 2022 | 8:41 PM

ఫ్యామిలీ అంతా తీర్థయాత్రల పేరు చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. ఇక్కడికి వచ్చి భక్తితో పలు దేవుళ్లను దర్శించుకున్నారు. ఆపై వెంటనే తప్పు పని చేశారు. వివరాల్లోకి వెళ్తే...

Viral: పోలీసులను చూడగానే కారులోనే ఫ్యామిలీని వదిలేసి పరారైన వ్యక్తి.. అనుమానంతో ఎంక్వైరీ చేయగా..
representative image
Follow us on

Telangaan Crime News: మత్తే.. మత్తు.. పట్టుబడుతున్న సరుకును చూస్తుంటే.. పోలీసులకే కళ్లు తిరుగుతున్నాయి. మరీ ఈ స్థాయిలో అంటే.. యువత ఏ రేంజ్‌లో ఈ మాయదారి మత్తుకు బానిసలయ్యారో అర్థమవుతుంది. రకరకాల ఎత్తులు వేస్తూ.. గుట్టుగా గంజాయి రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు స్మగ్లర్స్. పుష్ప(Pushpa)ను మించిన స్కెచ్చులతో రెచ్చిపోతున్నారు. ఆదాయం ఊహించనంత ఉండటంతో.. ప్రాణాలకు తెగిస్తున్నారు. దేశవ్యాప్తంగా డైలీ గంజాయి పట్టుబడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. పోలీసులు కూడా అలెర్ట్ అయి కేటుగాళ్ల నయా ఫార్ములాలకు చెక్ పెడుతున్నారు. తాజాగా దైవదర్శనం పేరుతో ఓ ఫ్యామిలీ మొత్తం గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.  వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర(maharashtra)లోని నాసిక్ జిల్లా మాలేగావ్‌కు చెందిన దేవీదాస్ రాథోడ్, మీరాబాయి, పూజా సంతోష్ పవార్, చౌహాన్ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు డబ్బు బాగా వస్తుండటంతో గంజాయి అక్రమ రవాణాకు పూనుకున్నారు. పనిలో పనిగా దైవ దర్శనాలు చేసుకుంటూ.. అక్రమ దందా కొనసాగిస్తున్నారు. మన దగ్గర పోలీసులు ఆపి ప్రశ్నిస్తే.. తీర్థయాత్రలకు వెళ్తున్నామని చెబుతున్నారు. ఇంటి దగ్గర కూడా ఇరుగుపొరుగు వారి అదే చెప్పి.. ప్రయాణం షురూ చేస్తున్నారు. అలాగే ఇటీవల ఏపీ, తెలంగాణల్లో కొన్ని దేవాలయాలను దర్శించుకున్నారు.

ఇటీవల రాజమహేంద్రవరం(Rajamahendravaram) వచ్చి రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత చౌహాన్ గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లి కారులో 8 బస్తాల్లో 200 కిలోల గంజాయి తీసుకుని వచ్చారు. దాన్ని కార్‌లో లోడ్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు రిటన్ జర్నీ షురూ చేశారు. ఈ క్రమంలో కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండటంతో.. వీరు కంగారు పడ్డారు.  వెంటనే కారును హుజూర్‌నగర్‌ వైపు మళ్లించారు. డౌట్ రావడంతో పోలీసులు వెంటాడారు. మాధవరాయుని గూడెం సమీపంలో కారు నిలిపి చౌహాన్ ఎస్కేప్ అయ్యాడు. అతని తల్లి దేవీదాస్ రాథోడ్, కూతురు మీరాబాయి, కొడుకు పూజా సంతోష్ పవార్‌ కారులోనే ఉండిపోయారు.  పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని  200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి