Telangana PGECET-2021: తెలంగాణలో పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నాడు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యూకేషన్ తన అధికారిక వెబ్‌సైట్ pgecet.tsche.ac.in లో తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీజీఈసెట్ఇ-2021) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తును చేసుకోవచ్చునని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన ఎంట్రెస్ట్ టెస్ట్‌ను జూన్ 19వ తేదీన నిర్వహించనున్నారు. ఎమ్ఈ, ఎమ్‌టెక్, ఎంఫార్మా, ఎంఆర్క్, డిఫార్మ్ కోర్సులలో ప్రవేశానికి సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆహ్వానిస్తోంది. ఈ కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించనున్నారు. కాగా, అభ్యర్థులు టీఎస్ పీజీఈసెట్ 2021 కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అభ్యర్థులు ఏం చేయాలంటే..
1.అధికారిక వెబ్‌సైట్ అయిన pgecet.tsche.ac.in లోకి వెళ్లాలి.
2. అప్లికేషన్ విండోపై క్లిక్ చేయాలి.
3. అభ్యర్థి పేరు, అవసరమైన వివరాలతో రిజిస్ట్రర్ అవ్వాలి.
4. TS PGECET అడ్మిషన్ పోర్టల్‌లోకి లాగిన్ అయి అప్లికేషన్ ఫిల్ చేయాలి.
5. ఎంచుకున్న కోర్సుకు సంబంధించి ఫీజు చెల్లించాలి.
6. దరఖాస్తును కంప్లీట్ చేయాలి.
గమనిక: టిఎస్ పిజిఈసెట్‌కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కొన్ని ధృవపత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 10వ తరగతి సర్టిఫికెట్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు, తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ డిజిటల్ కాపీ, కుల ధృవీకరణ పత్రం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత సంబంధిత కోర్సు ఫీజు చెల్లించడం ద్వారా అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు.
Also read:
Mermaid Baby : హైదరాబాద్‌లో మత్యకన్య రూపంలో జన్మించిన శిశువు.. పుట్టిన రెండు గంటల్లోనే మృతి