Telangana Secretariat: నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్కర్ పేరు పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్‌ఎస్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్‌తో పాటు టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ తమ కృతజ్ఞతను తెలియ చేస్తున్నారు. ఇందులో బాగంగా గురువారం మల్లంపేట్‌లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దళిత సంఘాల ప్రతినిధులు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహం, కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నిజాంపేట్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తెరాస పార్టీ కమిటీల నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈనెల 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ఏర్పాట్లను మంత్రులు తలసాని, సత్యవతి రాథోడ్, CS సోమేశ్ కుమార్,MLC సురభి వాని దేవి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, MLA లు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ పలు శాఖల అధికారులు పరిశీలించారు. అనంతరం తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరును ప్రకటించడంపై సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..