TS Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ముంపటి రాజుకుంటుంది. సొంతగూటిలోనే నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలు కొనసాగిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తుంటున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ విషయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పట్టువీడటం లేదు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై రేవంత్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యాలకు బాధ్యత వహిస్తూ తాజాగా రేవంత్‌రెడ్డి వెంకట్‌రెడ్డికి క్షమాపణలు చెప్పారు. రాష్ట్ర ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాత్ర ఎంతో కీలకమైందని, అలాంటి వ్యక్తి పార్టీకి సేవలందించేందుకు ఎంతో అవసరమని అన్నారు. తనకు పార్టీ దూరం పెట్టిందని, కార్యక్రమాలపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ వెంకట్‌రెడ్డి కొన్ని రోజులుగా అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు.
అయితే రేవంత్‌రెడ్డి క్షమాపణలు వెంకట్‌రెడ్డి లైట్‌గా తీసుకున్నారు. అద్దంకి దయాకర్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. సొంటింట్లోనే తెగ పంచాయితీల మారింది. దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రేవంత్‌రెడ్డి క్షమాపణలపై స్పందిస్తానని, ఆ తర్వాతే మునుగోడు ప్రచారానికి వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి నుంచి ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. తమతమ పార్టీ నుంచి ఎవరిని రంగంలోకి దింపాలి.. ఎలాంటి ముందుకెళ్లాలనే వ్యహాలు రచిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఇలాంటి రాజకీయాలు మరింతగా ముదురుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి