Telangana: పండుగ గిఫ్ట్.. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ వేతనాలు పెంపు.. ఎంతంటే..?

సంక్రాంతి పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడ పనిచేసే సిబ్బందికి గౌరవవేతనాన్ని 30శాతం పెంచుతూ ఆదేశాలిచ్చారు.

Telangana: పండుగ గిఫ్ట్.. పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ వేతనాలు పెంపు.. ఎంతంటే..?
Telangana Govt News

Updated on: Jan 06, 2022 | 8:05 PM

సంక్రాంతి పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పురపాలికల్లోని(మున్సిపాలిటీల్లోని) సిబ్బందికి గౌరవవేతనాన్ని 30శాతం పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్‌సోర్సింగ్ పద్ధతిన ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న 22,533 మందితో పాటు 7,271 మంది ఇతరులు.. అంటే మొత్తం 29,804 మందికి వేతనాలను పెంచారు. పెరిగిన వేతనాలు 2021 జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. గవర్నమెంట్ ఉత్తర్వులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశించారు.

Also Read: భార్యతో వివాహేతర సంబంధం! కోపం పట్టలేక.. దమ్ము చక్రాలతో నుజ్జునుజ్జుగా తొక్కించాడు

Telangana: వారికి సెలవలు రద్దు చేసిన తెలంగాణ సర్కార్.. నేటి నుంచే అమల్లోకి

 

Loading...
Unable to load recommendations.
Follow Us