Telangana: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగుల జీతం నుంచి 15శాతం కట్!

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత’ అనే బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15% కోత విధించి నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమచేసేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం.

Telangana: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగుల జీతం నుంచి 15శాతం కట్!
Telangana Parental Care Law

Updated on: Mar 29, 2026 | 5:18 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది కుమారులు వయస్సు మళ్లిన తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేశారు. సపరేటు జీవనం కావాలంటూ కనిపెంచిన తల్లిదండ్రులను వదిలి నివసిస్తున్నారు. లేదా వారిని ఓల్డేజ్ హోమ్స్‌లో చేర్పిస్తున్నారు. దీనిపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం వయస్సు మళ్లిన తండ్రిలుకు ఆర్థిక భరోసా కల్పిచేందుకు రాష్ట్రంలో సరికొత్త బిల్లును ప్రవేశ పెట్టింది. ఆదివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత అనే బిల్లును ప్రవేశపెట్టి.. ఆ బిల్లుకు ఆమోదం కూడా తెలిపింది.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు ప్రకారం.. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగి జీతంలో నుంచి 15 శాతం వేతనాన్ని కట్‌చేసి.. ఆ నిధులను నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమచేసేలా ఈ కొత్త చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఈ చట్టం పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ బిల్లు ఆమోదం సందర్భంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల కోసం తల్లిదండ్రులు తమ రెక్కలు ముక్కలు చేసుకొని, శక్తినంతా ధారపోస్తారని, కానీ పిల్లలు మాత్రం రెక్కలు వచ్చాక పేరెంట్స్‌ను పట్టించుకోవడం మానేశారన్నారు. ఆ వయస్సులో వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు ఈ చట్టం గుణపాఠం లాంటిదని చెప్పుకొచ్చారు. అలాంటివాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని ఆయన అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us