
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 22న ప్రభుత్వం జీవో నెం.46ను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల రిజర్వేషన్లు మొత్తం కలిపి 50 శాతం దాటకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ కొందరు వ్యక్తులు హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దశలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.46పై స్టే విధించలేమని స్పష్టం చేశారు.
విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేనందుకు ఎన్నికలు రద్దు చేయాలని మీరు కోరుకుంటున్నారా అని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. కాగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదన్న EC అడ్వకేట్ తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. 42% రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో.. పాతపద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మేమే చెప్పాం కదా అని హైకోర్టు తెలిపింది.
అయితే 2009లో ఇదే పరిస్థితి వచ్చినప్పుడు GHMC ఎన్నికను రద్దు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అయితే దీనిపై స్పందించిన కోర్టు ఎన్నికలు నిర్వహించాలని మేమే ఆదేశించి.. మళ్లీ మేమే ఎలా స్టే విధిస్తామని తెలిపింది. ఈ సందర్భంలో డెడికేటెడ్ కమిషన్ నివేదికను బహిర్గతం చేసి.. కాపీ ఇవ్వాలన్న పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా.. దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్న హై కోర్టు స్పష్టం చేసింది. అలాగే సబ్ కేటగిరీ రిజర్వేషన్లపై ఆరు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.