ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతాల సందర్శనకు వెళ్లిన 82 మంది పర్యాటకులు ఊహించని ఆపదలో చిక్కుకున్నారు.. 8 గంటల పాటు కారడివిలో, కుండపోత వర్షంలో ఆహాకారాలు చేశారు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన పర్యాటకులు చివరకు ఎన్ డీ ఆ ఎఫ్ బృందాలు, పోలీసులు సాహసంతో మృత్యుంజయులయ్యారు.
బుధవారం సెలవు దినం కావడంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు పర్యటకులు ములుగు జిల్లాలోని జలపాతాల సందర్శనకు వెళ్లారు.. వారిలో కొందరు వీరబద్రవరం గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతాల సందర్శన కోసం వెళ్లారు.. అక్కడ జలపాతాల్లో జలకాలాడి ఫుల్ గా ఎంజాయ్ చేశారు.. కానీ ఆ పర్యాటకులు తిరుగు ప్రయాణంలో ఊహించని ఆపదలో చిక్కుకున్నారు.. మార్గ మధ్యలో గగ్గేని వాగు ఉప్పొంగింది.. మధ్యలో మరో రెండు కాలువలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.. దీంతో పర్యాటకులు అడవిలో చిక్కుకున్నారు.. దిక్కుతోచని స్థితిలో ఆహాకారాలు చేశారు.. మొత్తం 82 మంది అడవిలో చిక్కుకోగా వారిలో కేవలం ఇద్దరి సెల్ ఫోన్లు మాత్రమే పనిచేశాయి.. ఈ క్రమంలో అడవిలో ఆపదలో చిక్కుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారి ఫ్రెండ్స్ కు తెలియ పర్చారు.. ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది.. NDRF బృందాలను రంగంలో దింపారు.. జిల్లా కలెక్టర్, SP అర్ధరాత్రి వరకు అక్కడే వుండి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.. కుండపోత వర్షంలో అతికష్టం మీద NDRF బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.. మార్గమధ్యలో వరద ఉప్పొంగి ప్రవహిస్తున్న రోప్ సహాయంతో అడవిలోకి వెళ్లి వారిని కాపాడారు.
82 మందిని సురక్షితంగా వీరభద్రవరం చేర్చారు.. వారికి అక్కడ భోజనాలు ఏర్పాటుచేసి తిరిగి స్వగ్రామాలకు పంపారు.. వారిని కాపాడడం కోసం కృషిచేసిన మంత్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు..ప్రాణాలు తెగించి వారి కాపాడిన గ్రామస్తులు, NDRF బృందాలు, పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. అడవిలో ఎనిమిది గంటలపాటు నరకం అనుభవించామని గుర్తు చేసుకుంటూ నవైద్వెగానికి లోనయ్యారు.. ఇది మాకు పునర్జన్మన్నారు. మొత్తం మీద ఆపరేషన్ సక్సెస్ అయి ఆ 82 మంది సురక్షితంగా బయట పడడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..