
Telangana: తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. కుదరకపోవడంతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదే సమయంలో యువతి తండ్రి రావడంతో.. నిందితుడు పారిపోయాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖానాపూర్ గ్రామానికి చెందిన ఓదెలు పొలం పనుల కోసం వ్యవసాయక్షేత్రానికి వెళ్లాడు. ఇంటికి తిరిగి రాగా.. అదే గ్రామానికి చెందిన మంథని సతీష్.. తన కూతురుపై బలవంతం చేస్తూ పురుగులు మందు తాగించే ప్రయత్నం చేస్తున్నాడు. అది గమనించిన ఓదెలు.. సతీశ్‌పై కర్రతో దాడి చేశాడు. సతీశ్ తప్పించుకోగా.. ఆ కర్ర కాస్తా ఓదెలు కూతురు తలకు బలంగా తగిలింది. దాంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఓదెలు తన కూతురును ఆస్పత్రికి తరలించాడు. జరిగిన విషయాన్ని మంథని పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మంథని సతీశ్ కోసం గాలిస్తున్నారు.
ఇదిలాఉండగా.. ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ ఓదెలు కూతురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే గ్రామంలో సతీష్ అన్న మంథని మధుకర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దీంతో కొన్ని రోజులు ఈ గ్రామంలో ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలో ఈ వివాదం చెలరేగడం.. గ్రామంలో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, సతీష్‌పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారయత్నం, హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.
Also read:
YSR Nethanna Nestham: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. రేపే లబ్ధిదారుల అకౌంట్‌లో రూ.24 వేలు..
Gardening: ఇంటితోట కోసం మొక్కలు కొంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి..