Telangana: తెలంగాణలో మున్సిపల్ హీట్.. పట్టణాలపై పార్టీల స్పెషల్ ఫోకస్..

రాష్ట్రంలో రాజకీయ వేడి పట్టణాలకు చేరింది. నిన్నటిదాకా పల్లె పల్స్ పట్టుకోవడంలో పోటీ పడ్డ ప్రధాన పార్టీలు, ఇప్పుడు అర్బన్ ఓటరును మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. పంచాయతీ ఎన్నికల ముగిసిన వెంటనే వెంటనే మున్సిపల్ వార్ కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. షెడ్యూల్ రాకముందే బస్తీ మే సవాల్ అంటున్నాయి.

Telangana: తెలంగాణలో మున్సిపల్ హీట్.. పట్టణాలపై పార్టీల స్పెషల్ ఫోకస్..
Telangana Municipal Elections 2026,

Updated on: Jan 14, 2026 | 8:29 AM

మొన్నటిదాకా రామీణ ఓటరు పల్స్ పట్టుకోవడంతో తెగ పోటీపడి, పంచాయతీ ఎన్నికల్ని రంజుగా మార్చేశాయి పార్టీలు. ఇక ఇప్పుడు అర్బన్ ఓటరు వంతు. బస్తీ ఓటరును ఫిదా చేయడమెలా? మరో నెలరోజుల్లో వచ్చే మున్సిపల్ వార్‌లో నెగ్గడం ఎలా?అనే ఆలోచనతో పార్టీలు దూకుడు పెంచాయి. ఈ మేరకు నేతల నుంచి డైనమైట్లు లాంటి డైలాగులు పేలుతున్నాయి.

ఫిబ్రవరిలోనే మున్సిపల్ జరిగే అవకాశం ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏ క్షణంలోనైనా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు కూడా బస్తీ మే సవాల్ అంటున్నాయి. ఈ నెల 16 నుంచి మున్సిపాలిటీల్లో సీఎం రేవంత్ ప్రచారానికి సిద్ధమయ్యారు. అపోజిషన్ పార్టీ బీఆర్‌ఎస్ అంతకుముందే మేలుకుంది. జిల్లా స్థాయి సమావేశాలతో లీడర్లను కేటీఆర్ అప్రమత్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, సీనియర్ లీడర్లు, పార్టీ జిల్లా ప్రెసిడెంట్లతో వరుసగా భేటీ ఔతూ వాళ్లలో భరోసా నింపుతున్నారు. 4వేలకు పైగా గ్రామపంచాయతీల్లో గెలిచాం, రెండేళ్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో పెరిగిందో దీన్ని బట్టే అర్థమౌతోందంటూ క్యాడర్‌కి గులాబీ పార్టీ అధిష్ఠానం బూస్ట్ ఇస్తోంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్‌ పరిధిలోని చేరికల సమయంలో మాజీ మంత్రి హరీశ్ రావు సుతిమెత్తగా తనదైన ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టారు.

రూలింగ్ పార్టీ కూడా జూబ్లీహిల్స్ ఇచ్చిన జోష్‌తో రంగంలోకి దిగింది. క్వార్టర్ ఫైనల్స్ కొట్టాం, రేపటిరోజున సెమీఫైనల్స్ కూడా కొట్టబోతున్నాం.. ఫైనల్స్‌లో కూడా మాదే విక్టరీ అంటోంది . పంచాయతీ ఎన్నికల్లో కంటే మున్సిపల్ పోరులో ఎక్కువ సత్తా చూపుతామన్న ధీమాతో రేవంత్ సర్కార్ ఉంది. పంచాయతీ ఎన్నికల్లో అంతో ఇంతో ఉనికిని చాటుకున్న కమలం పార్టీ.. పట్టణ ఓటుపై ఫోకస్ పెంచింది. మున్సిపాలిటీల్లోని 2వేల 996 వార్డుల్లో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 117 మున్సిపాలిటీలు.. 6 కార్పొరేషన్లు, 52 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. అటు మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై కూడా తెలంగాణ సర్కార్ కసరత్తు షురూ చేసింది. వార్డులు, చైర్‌పర్సన్ స్థానాలకు మున్సిపల్ శాఖ నేడో రేపో రిజర్వేషన్లు ఖరారు చేసి, ఈసీకి పంపనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..