MLA Seethakka : కరోనా మహమ్మారి విజృంభణతో వైద్య ఖర్చులు తెలంగాణ ప్రజలకు మోయలేని భారంగా మారాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ట్రీట్మెంట్ కోసం ఆస్తులు అమ్ముకుని పేద కుటుంబాలు ఆగమౌతున్నాయని ఆమె తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా తక్షణమే ఉచిత వైద్యం అందించాలని ఆమె ఇవాళ సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ప్రతి పౌరుడికి ఇంటి వద్దే వాక్సిన్ వేయాలని.. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీతక్క.. కేసీఆర్ సర్కారుని కోరారు. కాగా, గురువారం ఎమ్మెల్యే సీతక్క ఒక పోలీస్ ఉన్నతాధికారి మీద తన అసంతృప్తిని వీడియో కాల్ రూపంలో వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
కరోనా కష్టకాలంలో ప్రజలు అనారోగ్యం సహా అనేక కారణాలతో తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే, కొందరు పోలీసులు తమ ఇష్టానికి వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న తన తల్లికి బ్లడ్ ఇచ్చేందుకు తన కుటుంబసభ్యులు హైదరాబాద్ వెళ్తుంటే వాళ్లని రోడ్డుపై అడ్డుకుని అరగంటకు పైగా రక్షిత అనే డీసీపీ నిలిపివేశారంటూ సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సేవకురాలు ఎమ్మెల్యే అయినా నాకు ఈ విధంగా ఇబ్బందులు ఎదురైతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. అని సీతక్క ప్రజల ఇబ్బందులపై గళమెత్తారు.
Read also : Maharashtra To Unlock : అన్ లాక్ బాటలో మహారాష్ట్ర.. సోమవారం నుంచి లాక్ డౌన్ సడలింపులు