Corona Effect: తెలంగాణ‌లో సినిమా షో స‌మ‌యాల్లో మార్పులు.. క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో నిర్ణ‌యం తీసుకున్న …

| Edited By: Team Veegam

Apr 21, 2021 | 12:03 PM

Corona Effect: క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని అత‌లాకుతలం చేసేస్తోంది. రోజురోకూ పాజిటివ్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దే ప‌నిలో ప‌డ్డాయి. ఇప్ప‌టికే...

Corona Effect: తెలంగాణ‌లో సినిమా షో స‌మ‌యాల్లో మార్పులు.. క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో నిర్ణ‌యం తీసుకున్న ...
Theaters In Telangana
Follow us on

Corona Effect: క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని అత‌లాకుతలం చేసేస్తోంది. రోజురోకూ పాజిటివ్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దే ప‌నిలో ప‌డ్డాయి. ఇప్ప‌టికే దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, క‌ర్ఫ్యూ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం కూడా రాత్రి క‌ర్ఫ్యూను విధించింది. మంగ‌ళ‌వారం రాత్రి నుంచి ఈ నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి వ‌చ్చాయి. దీంతో ఈ ప్ర‌భావం సినిమా థియేట‌ర్ల‌పై కూడా ప‌డింది.
రాత్రి 9 గంట‌ల నుంచి క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి వ‌స్తుండ‌డంతో థియేట‌ర్ల‌ను 8 గంటలకే మూసేయాలని ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా థియేటర్లలో 24 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత, 40–70 శాతం తేమ, లోపలికి, బయటికి గాలి ప్రసరించేలా ఏర్పాట్లు చేయాలి. ఇంటర్వెల్, ముగింపు సమయంలో ప్రేక్షకులు భారీగా గుమిగూడకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో థియేటర్ య‌జ‌మానులు సెకండ్ షోను ర‌ద్దు చేశారు. ఇక మిగ‌తా మూడు షోల స‌మ‌యాల్లో మార్పులు చేశారు. మార్నింగ్ షోను ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.30 వ‌ర‌కు, మ్యాట్నీ షోను మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయ‌త్రం 4.30 వ‌ర‌కు… సాయంత్రం ఫ‌స్ట్ షోను 5 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల లోపు ముగించేస్తున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకూ ప్రమాదకరంగా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 6,542 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read: india Covid-19: ఒక్కరోజే మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు.. రెండు వేల మార్క్ దాటిన మరణాల సంఖ్య

మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే.. 

Family Suicide: క్షణికావేశంలో ముగ్గురి ప్రాణాలు బలి.. ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య