Kalvakuntla Kavitha: ‘నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా’.. ఎంపీ అర్వింద్ కు కవిత స్ట్రాంగ్ వార్నింగ్..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, టీఆర్ఎన్ నేతల మాటలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుమార్తె పార్టీ మారుతారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో...

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, టీఆర్ఎన్ నేతల మాటలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ మారుతారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారని.., అందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేశారని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కామెంట్లపై కవిత రెస్పాండ్ అయ్యారు. తనపై అనవసర కామెంట్లు చేస్తే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని ఘాటుగా హెచ్చరించారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తానని అన్నారు. తాను ఖర్గేతో మాట్లాడతానని, కాంగ్రెస్ లో చేరుతున్నానని దుష్ప్రచారాలు చేస్తున్నారని, కానీ ఎంపీ అర్విందే వారితో టచ్ లో ఉన్నారని కవిత మండిపడ్డారు. ఇంకో సారి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కొట్టి కొట్టి చంపుతానని వార్నింగ్ ఇచ్చారు.
కాగా.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కవితను ఆహ్వానించలేదని, దీంతో ఆమె అలిగి పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. అయితే.. కవితను బీజేపీలో చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని, రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటంబం భ్రష్టు పట్టించదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవితను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నించిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అర్వింద్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ఆయన సూచించారు.
మరోవైపు.. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. బంజారాహిల్స్‌లోని ఎంపీ ఇంట్లోకి టీఆర్ఎస్ కార్యకర్తలు చొరబడి అద్దాలు పగలగొట్టారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. కార్యకర్తలన అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత ఎంపీ అర్వింద్ కు వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం..