Bjp vs Trs: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేకి అంటూ కేంద్ర హోమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చి సీఎం కేసీఆర్‌ను రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్ధపు అతిపెద్ద జోక్ అని సెటైర్ వేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. రైతుల పట్ల కేంద్రం అవలంభిస్తున్న విధానాలను తూర్పారబట్టారు. ఒకవైపు కేసీఆర్ ఆలోచనా విధానాల నుంచి రూపొందిన రైతుబంధు వంటి కార్యక్రమాలను మక్కీకి మక్కీగా కాపీ కొట్టి పీఎం కిసాన్‌గా మార్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు కేసీఆర్‌నే రైతు వ్యతిరేకి అనడం విడ్డూరంగా ఉందన్నారు
రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతుల ప్రాణాలను బలిగొన్నది కేంద్ర ప్రభుత్వం కదా? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. అంతమంది ఉసురు తీసిన తరువాత.. దేశ రైతాంగం తీవ్ర వ్యతిరేకతతో క్షమాపణలు చెప్పింది ప్రధాని మోదీ కాదా? అని ప్రశ్నించారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం పథకమైన ఫసల్ బీమా యోజనలో చేరలేదని సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్న అమిత్ షా.. మరి గుజరాత్ ప్రభుత్వ ఆ పథకాన్ని ఎందుకు తిరస్కరించిందో చెప్పాలన్నారు. అదే పథకం నుంచి గుజరాత్ ప్రభుత్వం ఎందుకు వైదొలిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. మీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని రైతంగానికి ఎలాంటి ప్రయోజనం కలిగించని ఈ పథకం.. తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందో చెప్పాలి అని అమిత్ షాను నిలదీశారు మంత్రి కేటీఆర్. ఇప్పటికైనా అర్థరహితమైన హిపోక్రసీని వదిలిపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సూచించారు మంత్రి కేటీఆర్.
He criticized Hon’ble CM KCR Garu for not joining centre’s Fasal Bheema Yojana
Earlier, Gujarat BJP government too rejected this scheme of NPA Govt & opted out!
If it isn’t good for your own home state Gujarat, how is it good for Telangana?
What absurd hypocrisy is this?
— KTR (@KTRTRS) August 22, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..