KTR: కనీసం ఈ బడ్జెట్ లోనైనా తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయండి.. కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి..

|

Jan 31, 2022 | 12:35 PM

రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్‌ (Hyderabad)లో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ డ్రిల్‌మెక్ కార్యాలయం రానుంది. 200 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడితో గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్  హబ్ ఏర్పాటుకానుంది. 

KTR: కనీసం ఈ బడ్జెట్ లోనైనా  తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయండి.. కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి..
Health profile in Telangana
Follow us on

రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్‌ (Hyderabad)లో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ డ్రిల్‌మెక్ కార్యాలయం రానుంది. 200 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడితో గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్  హబ్ ఏర్పాటుకానుంది.  దీనికి సంబంధించి నేడు డ్రిల్ మెక్- తెలంగాణ ప్రభుత్వం (TS Government) మధ్య నేడు అవగాహన ఒప్పందం (MOU) జరిగింది.  ఈ సందర్భంగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు డ్రిల్ మేక్ సంస్థకు   ఐటీశాఖా మంత్రి కేటీఆర్ (KTR) ధన్యవాదాలు తెలిపారు.  కాగా నేటి నుంచి  కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం ఈసారైనా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.  రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన హామీలు నెరవేర్చాలని కోరారు.

‘గడిచిన ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఎలాంటి సహాయ, సహకారాలు లేవు. తెలంగాణ కాకతీయ, మెగా టెక్స్ట్ పార్క్, ఫార్మా సిటీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటికి రాలేదు.  కనీసం ఈసారి కేంద్ర బడ్జెట్ లోనైనా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలి. మాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు అందించాలి.   ప్రధానమంత్రి  నరేంద్రమోడీ పదే పదే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నారు. రాష్ట్రాలకు నిధులు  ఇవ్వకపోతే పారిశ్రామికాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?. భారతదేశంలో  నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కేంద్రం సహకరిస్తే  ఇక్కడి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు  కేంద్ర సహకారం ఎంతో అవసరం. మా హక్కులు డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Also read:

Telangana: ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిట

Railway Warehouse Workers: ఇండియన్‌ రైల్వేలో పని చేసే ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఆ జాబితాలో వారి పేర్లు..!

Priyanka Arul Mohan: అందాల రాశి ప్రియాంక మోహన్ లేటెస్ట్ పిక్స్ వైరల్