Telangana: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్ భేటీ.. బిజినెస్ తో పాటు ఆ విషయంపై చర్చ..

|

Jan 06, 2023 | 12:00 PM

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌.. తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఇద్దరు...

Telangana: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్ భేటీ.. బిజినెస్ తో పాటు ఆ విషయంపై చర్చ..
Ktr Satya Nadella
Follow us on

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌.. తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఇవాళ్టి రోజును ప్రారంభించడం సంతోషంగా ఉంది. బిజినెస్, బిర్యానీ గురించి మట్లాడుకున్నాంమని మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల వృద్ధి, హైదరాబాద్‌లో అవకాశాలు, ప్రోత్సాహకాలు, ప్రభుత్వ విధానాల ను సత్య నాదెళ్లకు వివరించినట్లు తెలుస్తోంది. నూతన సాంకేతికతపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.

కాగా.. బిర్యానీపై సత్య నాదెళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బిర్యానీని సౌత్‌ ఇండియా టిఫిన్‌ అనొద్దని.. అలా అని హైదరాబాదీనైన తనను అవమానించవద్దని కోరారు. భారత్‌ పర్యటనలో ఉన్న ఆయన బెంగళూరులో జరిగిన ఫ్యూచర్‌ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌లో ‘చాట్‌ జీపీటీ’ అనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఛాట్‌ రోబోను పరిచయం చేశారు. భవిష్యత్తులో పాపులర్‌ సౌత్‌ ఇండియన్‌ టిఫిన్స్‌ ఏముంటాయని ఆయన చాట్‌ రోబోను ప్రశ్నించగా.. ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అని చెప్పింది. దీనిని ఉద్దేశించి సత్య నాదెళ్ల ఈ కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..