పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్ పర్యటన కొనసాగుతోంది. మొదటిరోజు పలు కంపెనీల సీఈవోలు, పరిశ్రమల అధినేతలతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించిన ఆయన రెండోరోజు మరికొందరు పారిశ్రామికవేత్తలను కలుసుకున్నారు. ఇందులో భాగంగా కేటీఆర్ శుక్రవారం ప్యారిస్‌లో ‘మూవ్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ (MEDEF) డిప్యూటీ CEO జెరాల్డిన్ లెమ్లేతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. MEDEF అనేది ఫ్రాన్స్‌లో అతిపెద్ద ఎంప్లాయర్ ఫెడరేషన్. ఫ్రాన్స్ లోని 95% కంటే ఎక్కువ వ్యాపారాలు, SMEలు ఇందులో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఫ్రెంచ్ ఎస్‌ఎంఈలకు తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన సహాయ సహకారాలు అందిస్తోందని ఈ సందర్భంగా మంత్రి ఆమెకు వివరించారు. అదేవిధంగా ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఇటీవల సాధించిన విజయాలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు పుష్కలమైన అవకాశాలు కల్పిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
అందరి చూపు హైదరాబాద్ వైపే..
అనంతరం ప్యారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్ F లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. అక్కడి బృందంతో సమావేశమై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న T-Hub, WeHub , TWorks వంటి ఇన్నోవేషన్ సంస్థలు, అందులోని అవకాశాల గురించి వివరించారు. స్టేషన్ F అనేది ప్యారిస్ నడిబొడ్డున కేంద్రీకృతమైన ఓ స్పెషల్ క్యాంపస్. ఇందులో సుమారు 1,000కు పైగా స్టార్టప్‌లు ఉన్నాయి. దీని తర్వాత కేటీఆర్ బృందం ADP ఛైర్మన్ & CEO అగస్టిన్ డి రోమనెట్‌తో సమావేశమైంది. ADP ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ‘ భారతదేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రపంచంలోని ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి’ అని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి ప్యారిస్‌లోని సనోఫీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ మిస్టర్ ఫాబ్రిస్ బస్చిరా అండ్ గ్లోబల్ వ్యాక్సిన్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ ఇసాబెల్లె డెస్చాంప్స్‌ను కలిశారు. సనోఫీ త్వరలో తన హైదరాబాద్ ఫెసిలిటీ నుంచి సిక్స్ ఇన్ వన్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ సమావేశాల్లో కేటీఆర్ వెంట ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు ఉన్నారు.
Industries Minister @KTRTRS met @sanofi‘s Head of International Operations Mr Fabrice Baschiera and Head of Global Vaccines Public Affairs Ms Isabelle Deschamps in Paris.
Sanofi would soon be launching production of its Six in One vaccine from its Hyderabad facility. pic.twitter.com/h1LKQZtah1
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 29, 2021
Also Read: