KTR Letter: దాని జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుంది.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ వార్నింగ్‌!

: సింగరేణి విషయంలో కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించింది తెలంగాణ సర్కార్. కేంద్ర గనులశాఖ మంత్రికి కేటీఆర్‌ ఘాటు లేఖ రాశారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలం ఆపాలన్నారు‌. ఈ గనులను వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు డిమాండ్ చేశారు.

KTR Letter: దాని జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుంది.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ వార్నింగ్‌!
Ktr
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 07, 2022 | 1:56 PM

KTR Letter to Union Minister: సింగరేణి(Singareni) విషయంలో కేంద్రం(Union Government)పై యుద్ధాన్ని ప్రకటించింది తెలంగాణ(Telangana) సర్కార్. కేంద్ర గనులశాఖ మంత్రికి కేటీఆర్‌ ఘాటు లేఖ రాశారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలం ఆపాలన్నారు‌. ఈ గనులను వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు డిమాండ్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేపీ కుట్ర పన్నుతోందని కేటీఆర్‌ మండిపడ్డారు. సింగరేణి నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారమన్నారు. సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని.. సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందని వార్నింగ్‌ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేళ్ల కాలంలో అభివృద్ధిలో అద్భుత ఫలితాలు సాధిస్తోందన్నారు. ఇలాంటి సంస్థను ఉద్దేశ్యపూర్వకంగా చంపే కుట్ర బీజేపీ చేస్తోందన్నారు మంత్రి కేటీఆర్‌.

అసలు సింగరేణిని బలహీనపరిచాలన్నదే కేంద్రం కుట్రగా భావిస్తున్నామన్నారు. బ్లాకులు వేరే సంస్థలకు కేటాయించడం ద్వారా నష్ట పూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుటిల ప్రయత్నాల్లో కేంద్రంముందని విమర్శలు చేశారు. సింగరేణి అంటే కోల్ మైన్ మాత్రమే కాదు.. యువతకు ఉపాది కల్పించే గోల్డ్ మైన్ అన్నారు. తెలంగాణ వచ్చాక 16 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

సింగరేణిని ప్రైవేటకరిస్తే వారసత్వ ఉద్యోగాలు దొరకవని.. గనులు మూతపడిన కొద్దీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారన్నారు కేటీఆర్‌. కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటాలుండవన్నారు. సింగరేణి సంస్థ సమీప భవిష్యత్తులో కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిని కాపాడుకునేందుకు కార్మికులకు అండగా ఉంటామన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బలహీనపరిచి ప్రైవేటీకరణ చేసినట్లే.. సింగరేణిని చేయాలని చూస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ మండిపడ్డారు. అందుకే కేంద్ర గనుల శాఖామంత్రి ప్రహ్లాద్‌ జోషికి మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారన్నారు. గనుల బ్లాకుల వేలంతో సింరేణిని చావుదెబ్బ తీయాలని కేంద్రం చూస్తోందన్నారు. అదే జరిగితే సింగరేణి సెగ ఢిల్లీకి తాకుతుందన్నారు సుమన్‌. మరోవైపు, ఈనెల 9 నుంచి సింగరేణి వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టబోతున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు, TBGKS కార్మిక నాయకులు. అన్ని సంఘాలు కదిలిరావాలని పిలుపునిచ్చారు. నాలుగు బొగ్గు గనులను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడమే ధ్యేయంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటికే 40 వేల సంతకాలను సేకరించింది టీబీజీకేఎస్. ఈ సంతకాల సేకరణను రేపు కోల్ మినిస్ట్రీకి పంపనున్నారు.

Read Also….  Statue of Equality: ఆరో రోజుకు సమతామూర్తి సమారోహం.. శ్రీరంగం దివ్యదేశాలకు ప్రాణ ప్రతిష్ట చేసిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ